మొదటి షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకొని చివరకు బిగ్గెస్ట్ హిట్ అయినా మహేష్ బాబు సినిమా ఏదో తెలుసా….

మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా రాజకుమారుడు అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.మొదటి సినిమాతోనే హిట్ అందుకొని నటన పరంగా హీరోగా ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అభిమానులు కోరుకున్నట్లే స్టార్ ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నారు.ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు అనుకున్నంత విజయం సాధించలేకపోయాయి.అలాంటి టైం లో మహేష్ మురారి అనే ఫ్యామిలీ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.మురారి అనే కథాంశం చావు అనే థీమ్ తో సాగుతుంది.కృష్ణ గారు మరియు ఇండస్ట్రీలో ఉన్న వారంతా మహేష్ తీసుకున్న డెసిషన్ కు తప్పు పట్టినవాళ్ళే.

కానీ మహేష్ బాబు మాత్రం చేస్తే అలాంటి కథతోనే సినిమా చేస్తాను అని తేల్చి చెప్పడంతో సినిమా స్టార్ట్ చేయడం జరిగింది.సినిమా స్టార్ట్ అయ్యాక మధ్యలో కూడా ఒక పాట విషయంలో కృష్ణ వంశి మరియు నిర్మాతలు అయినా దేవి ప్రసాద్,రామలింగేశ్వర రావు మధ్య మనస్పర్థలు కూడా వచ్చాయట.మధ్యలో కృష్ణ గారు ఎంట్రీ ఇచ్చి సాల్వ్ చేయడం జరిగింది.చివరకు సినిమా పూర్తి అయ్యి 2001 ఫిబ్రవరి 17 న ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.రిలీజ్ అయ్యాక  మొదటి షో తోనే కృష్ణ గారి అభిమానుల నుంచి ప్లాప్ టాక్ ను దక్కించుకుంది ఈ చిత్రం.

క్లాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ చిత్రం బాగా ఆకట్టుకోవడంతో మాస్ సెంటర్లలో కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడం జరిగింది.ఈవెనింగ్ షో చుసిన కృష్ణ గారు అక్కడ ఆడియన్స్ రెస్పాన్స్ చూసి ఆశ్చర్యపోయారట.విమర్శకులు సైతం ఈ సినిమాలో మహేష్ బాబు నటన బాగుంది అని కామెంట్స్ చేయడంతో కృష్ణ గారు మరియు సినిమా యూనిట్ సంతోషం వ్యక్తం చేయడం జరిగింది.సిల్వర్ జుబ్లిని కంప్లీట్ చేసిన ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్ లో మొదటి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు అయినా కూడా టీవిలో ఈ సినిమా ప్రసారం అయితే ఇష్టంగా చూసే ప్రేక్షకులు చాల మందే ఉన్నారు.ఈ చిత్రంలో అలనాటి బాలచంద్రుడు అనే పాట ఇప్పటికి కూడా పెళ్లిళ్లలో వినిపిస్తూనే ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *