హిందీ సీరియల్స్ లలో మంచి గుర్తింపును తెచ్చుకుని సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.తాజాగా సీతారామన్ అనే సూపర్ హిట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయింది ఈ అమ్మడు.ఈ సినిమాలో ఆమె నటించిన సీత పాత్ర ఆమెకు మంచి క్రేజ్ ను ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టింది.ఈ సినిమాలో ఆమె లుక్స్,పెర్ఫార్మన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.ప్రస్తుతం ఈమెకు టాలీవుడ్లో కూడా అవకాశాలు వస్తున్నాయి.సీతారామమ్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆమెకు ఒక్కసారిగా ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా బాగా పెరిగిపోయారు.
ఇక ఈ సినిమాతో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ కు సంబంధించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంది.తాజాగా ఈమెకు సంబంధించిన ఒక పాత ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అస్సలు గుర్తుపట్టలేని విధంగా ఉన్న ఈమె లుక్ ను చూసి అందరు షాక్ అవుతున్నారు.

అయితే ఆమెకు స్కిన్ అలర్జీ రావడంతో కమిలిపోయి నల్లగా కనిపిస్తుందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.మరికొంత మంది అయితే ఇది మృణాల్ ఠాకూర్ ఫోటో కాదని వాదిస్తున్నారు.ఇంకొంత మంది ఇది ఏదైనా సినిమా షూటింగ్ కోసం ఇలా చూపిస్తున్నారు అని చెప్పుకొచ్చారు.మరి ఆ ఫోటో గురించి అసలు నిజం తెలియాలంటే మృణాల్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే.