మూడు కళ్ళతో జన్మించిన దూడ…భగవంతుని స్వరూపం అంటూ అక్కడికి తరలివెళ్తున్న జనం…

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచంలో ఏ వింత సంఘటన జరిగిన కూడా అది క్షణాల్లో అందరికి తెలిసిపోతుంది.వాటిలో కొన్ని చుస్తే నిజమే నా అని సందేహం కూడా వస్తుంది.మరికొన్నిటిని చూస్తే ఆశ్చర్యం కూడా కలుగుతుంది.అలాంటి ఆశ్చర్యాన్ని కలిగించే వింత సంఘటన ఒకటి ఛత్తీస్ ఘడ్ లో జరిగింది.ఛత్తీస్ ఘడ్ లో రాజనందగావ్ జిల్లాలో ఒక ఆవు మూడు కళ్ళతో ఉన్న ఒక దూడకు జన్మనిచ్చింది.పుట్టిన దూడ మూడు కళ్ళతో,ముక్కులో నాలుగు రంధ్రాలతో పుట్టింది.

మకర సంక్రాంతి రోజున ఆవు ఈ మూడు కళ్ళతో ఉన్న దూడకు జన్మనిచ్చింది.దాంతో అక్కడ ఉన్న యజమాని,గ్రామస్తులు అందరు సాక్షత్తు శివుడి రూపం అంటూ పూజిస్తున్నారు.ఈ పుట్టిన దూడను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు అక్కడికి చేరుకుంటున్నారు.భగవంతుని స్వరూపం అంటూ అక్కడికి వచ్చిన ప్రజలందరూ మూడు కళ్ళ దూడను పూజిస్తున్నారు.

ఇలా మూడు కళ్ళ తో పుట్టిన దూడ ఫోటోలు కొన్ని సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.ఈ వింత సంఘటన రాజనందగావ్ లోని గండాయ్ అనే గ్రామంలో జరిగింది.అయితే పశు వైద్యులు మాత్రం పిండం వృద్ధి చెందక అల జరింగిందంటూ తెలిపారు.దూడ ఆరోగ్యంగానే ఉన్నట్లు పశు వైద్యులు చెప్పుకొచ్చారు.అయితే ఏది ఏమైనా ఆ దూడను చేసేందుకు జనాలు మాత్రం తండోపతండాలుగా గండాయ్ గ్రామానికి తరలివస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *