Naa Autograph Gopika: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నా ఆటోగ్రాఫ్ హీరోయిన్ గోపిక…ఫ్యామిలీ ఫోటోలు వైరల్

NEWS DESK
1 Min Read
Naa Autograph Gopika

Naa Autograph Gopika: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కప్పుడు స్టార్లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు ప్రస్తుతం ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవాలని చాల మంది ప్రేక్షకులకు ఉంటుంది.ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి అలనాటి స్టార్ హీరో హీరోయిన్ లు ఇప్పుడు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది క్షణాలలో అందరికి తెలుస్తుంది.

అలా ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్ లలో నటి గోపిక కూడా ఒకరు అని చెప్పచ్చు.ఈమె రవితేజ హీరో గా నటించిన నా ఆటోగ్రాఫ్ అనే సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకుంది.తెలుగు ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈమె తెలుగు తో పాటు తమిళ్ లో కూడా పలు సినిమాలలో నటించింది.

Actress Gopika
Actress Gopika

అయితే చాల సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు మంచి బ్రేక్ అయితే రాలేదు.ఈమె అసలు పేరు గార్ల ఆంటో.ఈమె 1984 లో జన్మించారు.ఒక మోడల్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసిన గోపిక ఆ తర్వాత ప్రణయమానితుపాల్ అనే మలయాళ సినిమాతో తన సినీ కెరీర్ ను స్టార్ట్ చేసింది.ఆ తర్వాత తెలుగు,తమిళ్,కన్నడ సినిమాలలో కూడా నటించింది.

Actress Gopika
Actress Gopika

సౌత్ సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్న గోపిక 2008 అజిలేష్ చాకో ను పెళ్లి చేసుకుంది.ఈ దంపతులకు ఇద్దరు సంతానం.పెళ్లి తర్వాత గోపిక సినిమాలకు దూరంగా ఉంటూ తన పూర్తి సమయాన్ని తన కుటుంబం తోనే గడుపుతుంది.అయితే ప్రస్తుతం సోషల్ మీడియా లో గోపిక తన భర్త పిల్లలతో ఉన్న ఫ్యామిలీ ఫోటోలు కొన్ని వైరల్ అవుతున్నాయి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *