హీరోయిన్ లాగా ఎంతో అందంగా ఉన్న నదియా కూతురును ఎప్పుడైనా చూశారా…ఫోటోలు వైరల్…

Nadhiya Daughters

Nadhiya: ఆకట్టుకునే అందం, మంచి అభినయం ఉన్న హీరోయిన్లను చిత్ర పరిశ్రమ ఎప్పటికీ ఆదరిస్తూనే ఉంటుంది. ప్రేక్షకులు సైతం వారిని వెండితెరపై పదే పదే చూడాలనుకుంటారు. వారి  పర్సనల్ ఇష్యూస్ తో తాత్కాలికంగా, కొందరైతే శాశ్వతంగా వెండితెరకు దూరంగా వెళ్తారు. ఇది సాధారణంగా జరిగే విషయమే.. వివాహానికి ముందు మంచి క్రేజ్ తెచ్చుకొని పెండ్లయిన తర్వాత కొంత విరామం ఇచ్చి మళ్లీ వెండితెరపై మురిపిస్తారు మరికొందరు. అలాంటి వారిలో ‘నదియా’ ఒకరు.

నదియా మళయాల, తమిళం, తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో తమిళ, మళయాల భాషల్లో హీరోయిన్ గా నటించారు. సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన నదియాకు తెలుగులోనే ఎక్కువ ఆఫర్లు వచ్చాయి. ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం ‘అత్తారింటికి దారేది’ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ఈ మూవీలో అత్త పాత్రలో ఇమిడిపోయారు నదియా. వన్నె తరగని అందం ఆమె సొంతం ఆమెది. 

Nadhiya Daughters
Nadhiya Daughters

చిత్ర సీమ ‘నదియా’గా పిలుస్తున్నా ఆమె అసలు పేరు మాత్రం ‘జరీనా’. మళయాలీ ఇండస్ర్టీ ద్వారా చిత్ర సీమకు 1984లో పరియమైంది. తర్వాత కోలీవుడ్ ఇండస్ర్టీకి వెళ్లింది. 1988లో ‘బజార్ రౌడీ’ అనే చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన నదియా, మొదటి చిత్రంలోనే డ్యూయల్ రోల్ వేసి ఆకట్టుకుంది. తరువాతి పరిణామాలతో ఆమె ఇండస్ర్టీకి కొంచెం దూరంగా ఉన్నారు. 

ప్రభాస్ నటించిన హిట్ చిత్రం ‘మిర్చి’తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది నదియా. అప్పటి నుంచి చాలా వరకు చిత్రాల్లో ఆమె నటిస్తూనే ఉంది. మంచి స్టార్ నటికి ఉన్న ప్రాజెక్టులు ఆమెకు సైతం ఉన్నాయంటే ఆమె క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నా.. ఇప్పటికీ తరిగిపోని అదంతో హీరోయిన్ బీట్ చేస్తున్నారనడంలో సందేహం లేదని చెప్పాలి. తన ఫిజిక్ ను కూడా అలా కాపాడుకుంటూ వస్తున్నారు ఆమె. 

Nadhiya Daughters
Nadhiya Daughters

నదియా (జరీనా)కు ఇద్దరు కూతుళ్లు. వీరు ప్రస్తుతం అబ్రాడ్ లో చదువుకుంటున్నారు. చాలా మంది నటులు (కొందరు మినహాయించి) వారి వారసులను ఇండస్ర్టీలోకి తెస్తారు. కానీ నదియా తన కూతుళ్లను చిత్ర సీమకు ఇప్పటి వరకూ పరిచయం చేయలేదు. ఇటీవల కూతుళ్లతో ఆమె కలిసి సందడి చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవికాస్తా వైరల్ గా మారాయి. ఇంతటి అందగత్తెకు మరింత అందగత్తెలు పెట్టారని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. పొగడ్తల వర్షంలో తల్లీ కూతుళ్లు మురిపిపోతున్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *