త్రివిక్రమ్,మహేష్ సినిమాలో విలన్ పాత్రకు ఓకే చెప్పిన నందమూరి హీరో…షాక్ లో ఫాన్స్..!

NEWS DESK
2 Min Read

మహేష్ బాబు హీరోగా ఇటీవలే రిలీజ్ అయినా సర్కారు వారి పాట చిత్రం మంచి సక్సెస్ అందుకుంది.ప్రస్తుతం మహేష్ బాబు ఈ చిత్రంలో సక్సెస్ లో బిజీ గా ఉన్నారు.అయితే మరోపక్క మహేష్ బాబు తరువాతి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉండబోతుంది అన్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే పూజ కార్యక్రమాలలో మహేష్ బాబు పాల్గొన్నారు.ఈ చిత్రంలో మహేష్ బాబు కు జోడిగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు.ఈ సినిమాకు పార్ధు,అర్జునుడు,అసుర సంధ్య వేళలో అని టైటిల్ పరిశీలనలో ఉన్నాయి.అయితే మే 31 న సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన బిగ్ అప్ డేట్ ను ప్రకటించనున్నారు చిత్ర యూనిట్.ఫస్ట్ లుక్ తో ఉన్న పోస్టర్ తో పాటు సినిమా టైటిల్ ను కూడా రివీల్ చేయనున్నారు చిత్ర యూనిట్.

జులై రెండవ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.ప్రస్తుతం త్రివిక్రమ్ ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీ గా ఉన్నారు.రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఓ రేంజ్ లో కంపోజ్ చేస్తున్న ఒక ఫైట్ సీన్ తో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందట.అతడు,ఖలేజా సినిమాల తర్వాత 11 సంవత్సరాల గ్యాప్ తర్వాత మహేష్ బాబు,త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రానికి సంబంధించి మరో ఇంటరెస్టింగ్ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ చిత్రంలో నందమూరి తారక్ రత్న విలన్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం.చెల్లెలు సెంటిమెంట్ తో ఈ చిత్రం తెరకెక్కబోతుంది వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రంలో మహేష్ కు చెల్లెలిగా సాయి పల్లవి నటిస్తుందని ఒక వార్త సినిమా ఇండస్ట్రీలో వినబడుతుంది.దీనిపై ఇంకా క్లారిటీ రావలసి ఉంది.ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు కు అంకుల్ పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.త్రివిక్రమ్ ఈ పాత్రను చాల డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారని.మహేష్ బాబు,మోహన్ బాబు మధ్య జరిగే సన్నివేశాలు హై లెట్ గా ఉంటాయని చిత్ర యూనిట్ చెపుతున్నారు.దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావలసి ఉంది.ఒకప్పటి స్టార్ హీరోయిన్ శోభన కూడా ఈ చిత్రంలో మరో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు అని సమాచారం.ఈ చిత్రంలో మోహన్ బాబు కు జోడిగా శోభన నటించబోతున్నారని సమాచారం.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *