Home సినిమా Nandamuri Mokshagna: పెళ్ళిలో తండ్రి బాలయ్య తో కలిసి సందడి చేసిన మోక్షజ్ఞ….ఫోటోలు వైరల్

Nandamuri Mokshagna: పెళ్ళిలో తండ్రి బాలయ్య తో కలిసి సందడి చేసిన మోక్షజ్ఞ….ఫోటోలు వైరల్

0
Nandamuri Mokshagna
Nandamuri Mokshagna

Nandamuri Mokshagna: ఎప్పటి నుంచో నందమూరి బాలకృష్ణ అభిమానులు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు.నందమూరి అభిమానులు చాల సార్లు నందమూరి బాలకృష్ణ ను ఆయన వారసుడు,తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడు అని అడిగిన సందర్భాలు ఉన్నాయి.అయితే బాలకృష్ణ కూడా త్వరలో నందమూరి మోక్షజ్ఞ(Nandamuri Mokshagna) సినిమా ఎంట్రీ ఉంటుందని చెప్పుకొచ్చారు.అయితే ఆ విషయం గురించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు.చాల తక్కువ సందర్భాలలో మోక్షజ్ఞ బయట మీడియా కు కనిపించటం జరుగుతుంది.ఒకవేళ మోక్షజ్ఞ మీడియా కు కనిపిస్తే మాత్రం ఆయన ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో ఖచ్చితంగా వైరల్ అవుతాయి.

గత సంవత్సరం తెలంగాణ ఎన్నికల సమయంలో మోక్షజ్ఞ మీడియా కంట పడటం జరిగింది.అయితే గత కొన్ని రోజుల క్రితం బొద్దుగా ఉన్న మోక్షజ్ఞ ఇప్పుడు సన్నగా మారిపోయిన సంగతి అందరికి తెలిసిందే.దాంతో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఇస్తున్నాడు అనే వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో ఊపందుకున్నాయి.ఇప్పుడు తాజాగా మోక్షజ్ఞ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.నేడు ఉదయం మోక్షజ్ఞ తన తండ్రి నందమూరి బాలకృష్ణ తో కలిసి విశాఖపట్నం లో టిడిపి నేత మతుకుమిల్లి భరత్ తమ్ముడి పెళ్లి కి హాజరయ్యారు.

Nandamuri Mokshagna
Nandamuri Mokshagna

ఈ పెళ్లి వేడుకలో తన తండ్రి బాలకృష్ణ తో కలిసి సందడి చేసారు మోక్షజ్ఞ.ఈ వివాహ వేడుకకు పలువురు టిడిపి నేతలు హాజరయ్యారు.ఇదే పెళ్ళిలో మోక్షజ్ఞ కూడా కనిపించటంతో టిడిపి నేతలు మోక్షజ్ఞ తో కలిసి ఫోటోలు దిగారు.ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి.వైరల్ గా మారిన మోక్షజ్ఞ ఫోటోలను చూసి నందమూరి అభిమానులు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also read : మహేష్ బాబు యువరాజు హీరోయిన్ ను ఇప్పుడు చూస్తే గుర్తుపట్టగలరా…లేటెస్ట్ ఫోటోలు వైరల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here