Nandamuri Mokshagna: నందమూరి అభిమానులు నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అధిక శరీర బరువుతో ఉన్న మోక్షజ్ఞ మొదట సన్నబడిన తర్వాత నటనలో శిక్షణ తీసుకున్న తర్వాత హీరో గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని అనేక వార్తలు వినిపించాయి.కొన్ని సంవత్సరాల నుంచి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ అదిగో ఇదిగో అంటూ చాల వార్తలు వినిపించాయి.
ఇక నందమూరి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి నందమూరి అభిమానులు ఆశలు వదులుకున్న సమయంలో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి అదిరిపోయే అప్ డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.త్వరలోనే సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్న మోక్షజ్ఞ మొదటి సినిమా వచ్చే సంవత్సరం సెప్టెంబర్ రిలీజ్ కానున్నట్లు పరోక్షంగా చెప్పుకొచ్చారు.ఇదివరకు మోక్షజ్ఞ లుక్ ప్రేక్షకులకు ఆకట్టుకోలేకపోయింది.
ప్రస్తుతం న్యూ లుక్ లో ఉన్న ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేయడంతో ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలలో మోక్షజ్ఞ ను చూసిన అభిమానులు ప్రస్తుతం మోక్షజ్ఞ హీరోగా పర్ఫెక్ట్ గా ఉన్నారు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మోక్షజ్ఞ బరువు తగ్గడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తూ ఈయన కూడా ఎన్టీఆర్ మాదిరిగానే సర్జరీ చేయించుకున్నారేమో అంటూ చాల మంది భావిస్తున్నారు.ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా రాఖి సినిమా తర్వాత బరువు తగ్గడానికి సర్జరీ చేయించుకున్న సంగతి అందరికి తెలిసిందే.మోక్షజ్ఞ ఎన్టీఆర్ ను ఫాలో అయ్యి సర్జరీ చేయించుకొని సన్నబడ్డారని తెలుస్తుంది.