Balakrishna: బాలకృష్ణ ఎత్తుకున్న ఈ చిన్నారి ఎవరో చెప్పగలరా…అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలీవుడ్ హీరో..!

NEWS DESK
1 Min Read

Balakrishna: ప్రతి ఒక్కరికి చిన్ననాటి జ్ఞాపకాలు చాలానే ఉంటాయి.ఇక చిన్ననాటి జ్ఞాపకాలలో ముందుగా అందరి దగ్గర ఉండేవి చిన్ననాటి ఫోటోలు.అప్పటి ఫోటోలను చాల మంది అపురూపంగా దాచుకుంటారు.ఇక పెద్దవాళ్ళు అయినా తర్వాత ఆ చిన్ననాటి ఫోటోల ఆల్బం చూసుకుంటే ఆ కలిగే ఫీలింగ్ చాల బాగుంటుంది అని చెప్పచ్చు.సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత నుంచి కూడా సెలెబ్రెటీల,సినిమా తారల చిన్ననాటి ఫోటోలు అభిమానుల నుంచి చాల ఆదరణ పొందుతాయి.తమకు ఇష్టమైన హీరో హీరోయిన్లు,సెలెబ్రెటీల చైల్డ్ హుడ్ పిక్స్ ను చూడడానికి అభిమానులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తారు.

ఈ క్రమంలోనే ఇప్పటి వరకు దాదాపు నార్త్,సౌత్ అని తేడా లేకుండా ప్రతి ఒక్క హీరో హీరోయిన్ ల చిన్ననాటి ఫోటోలు ప్రతి రోజు వైరల్ అవుతూ మీరు గమనించే ఉంటారు.ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫొటోలో నందమూరి బాలకృష్ణ ఎత్తుకున్న ఈ బుడ్డోడు ఎవరో మీకు తెలుసా…ఇక నందమూరి ఫ్యామిలీకి చెందిన ప్రతి ఒక్కరి చిన్ననాటి ఫోటోలు నందమూరి ఫ్యాన్స్ భద్రంగా దాచుకొని ఉంటారు.సమయం వచ్చినప్పుడు సందర్భాన్ని బట్టి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.బాలయ్య ఎత్తుకున్న ఈ చిన్నారి ఎవరో కాదు ఎన్టీఆర్ మనవడు నందమూరి తారక రత్న.

Balakrishna

తారక రత్న నందమూరి మోహన కృష్ణ తనయుడు.మోహన కృష్ణ బాలయ్య కు అన్నయ్య.బాలయ్య తన అన్నయ్య కొడుకు అయినా తారక రత్న ను ఎత్తుకున్నారు.ఇక తారక రత్న ఒకటో నెంబర్ కుర్రాడు అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యారు.తారక రత్న టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూనే ఒకే రోజు 9 సినిమాలకు ప్రారంభోత్సవం జరుపుకొని అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసారు.యువరత్న,తారక్,భద్రాద్రి రాముడు,వేంకటాద్రి,నందీశ్వరుడు ఇలా పలు సినిమాలలో నటించిన తారక్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *