Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార కు ప్రస్తుతం ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.బాలీవుడ్ లో నయన్ కు మంచి బాండింగ్ ఏర్పడడంతో ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తుంది.ఇక ఇటీవలే నయనతార తన భర్త విగ్నేష్ తో కలిసి అంబానీ ఇంట్లో వినాయక చవితి వేడుకలో పాల్గొనడం జరిగింది.తాజాగా ఈమె తన భర్త పిల్లలతో కలిసి మలేసియా వెళ్లారు.అక్కడ తన కుమారులు ఉయిర్ రుద్రోణి యెన్ శివన్,ఉలాగ్ దైవిక యెన్ శివన్ పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నారు.
ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.ఇటీవలే షారుఖ్ ఖాన్ కు జోడిగా నయనతార నటించిన జవాన్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ హిట్ అయినా సంగతి తెలిసిందే.బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే రూ.1000 కోట్లు వసూళ్లు రాబట్టి కలెక్షన్ ల సునామి సృష్టిస్తుంది.ఈ క్రమంలోనే లేడీ సూపర్ స్టార్ కు బాలీవుడ్ లో అవకాశాలు క్యూ కట్టాయి.బాలీవుడ్ లో కూడా నయన్ కు మంచి బాండింగ్ ఏర్పడింది.
తాజాగా విగ్నేష్,నయనతార దంపతులు అంబానీ ఇంట్లో వినాయక చవితి వేడుకలో పాల్గొన్నారు.తాజాగా నయనతార,విగ్నేష్ దంపతులు కోలాలంపూర్ లో పెట్రోనాస్ ట్విన్ టవర్ వద్ద తమ కుమారులు అయినా ఉయిర్ రుద్రోణిల్ యెన్ శివన్,ఉలాగ్ దైవిక యెన్ శివన్ పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నారు.మై ట్విన్ టవర్స్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.సంతోషం..ఆశీస్సులు ఏడాది..జీవితంలో మీరు ఎంతో ఎత్తుకు ఎదగాలని చుట్టూ ఉన్న వాళ్లకు సంతోషాన్ని అందించాలని కోరుకుంటున్నాము.
మీ మా జీవితాలను మరింత అందంగా మార్చి ఎన్నో వెలుగులు నింపారు…మీతో గడిపే ప్రతి క్షణం పండగల ఉంటుంది.మీ పుట్టిన రోజు వేడుకుంటూ ఈ ఎత్తైన పవర్ ఫుల్ టవర్ వద్ద చేయాలనీ కళలు కన్నాము..అనుకున్నట్టుగానే మీ పుట్టిన రోజు ను సెలెబ్రేట్ చేసినందుకు సంతోషం గా ఉంది అంటూ తన కుమారు లతో దిగిన ఫోటోలను సోషల్ మీడియా ఖత ద్వారా షేర్ చేసారు.సినీ సెలెబ్రెటీలు కూడా ఈ ఫోటోలకు స్పందిస్తూ ఉయిర్,ఉలాగ్ లకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.
View this post on Instagram