రాజా రాణి,బెంగుళూరు డేస్ వంటి సినిమాలలో హీరోయిన్ గా చేసిన నజ్రియా నజీమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.రాజా రాణి చిత్రం తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నజ్రియా నజీమ్ ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చిన కథ నచ్చక మరియు వేరే ఇతర కారణాల వలన రిజెక్ట్ చేయడం జరిగింది.ప్రస్తుతం నజ్రియా నజీమ్ తెలుగులో అంటే సుందరానికి అనే చిత్రంలో నటిస్తుంది.వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇప్పటికే రిలీజ్ అయినా ఈ చిత్రం టీజర్ ప్రేక్షకులలో రెట్టింపు అంచనాలను కలగ జేసేలా ఉంది.
ఈ చిత్రంలో నజ్రియా న్యాచురల్ స్టార్ నాని కు జోడిగా నటించడం జరిగింది.జూన్ 10 న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రం కొరకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఇటీవలే చాల మంది స్టార్ హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయినా సంగతి తెలిసిందే.ఇదే క్రమంలో ఎంతో క్యూట్ గా బొద్దుగా ఉన్న నజ్రియా నజీమ్ చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ ఫొటోలో నజ్రియా చాల క్యూట్ గా ఉన్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమాలో విలన్ గా నటించిన ఫహద్ ఫాసిల్ నజ్రియా నజీమ్ భర్త అని అందరికి తెలిసిన విషయమే.పుష్ప మొదటి భాగంలో ఫహద్ ఫాసిల్ పాత్ర అంతగా లేకపోయినా పుష్ప రెండవ భాగంలో ఈ పాత్ర కీలకం కానుంది.వచ్చే నెల జూన్ లో పుష్ప ది రూల్ షూటింగ్ ప్రారంభం కానుంది.ఇక వచ్చే సంవత్సరం సమ్మర్ లో ఈ చిత్రం విడుదల కానుంది.ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించగా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.