రెండు తెలుగు రాష్ట్రాలలో జబర్దస్త్ కామెడీ షో కు ఉన్న క్రేజ్ గురించి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.గత 9 సంవత్సరాల నుంచి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ కామెడీ షో లో గత కొన్ని రోజుల నుంచి మార్పులు చోటు చేసుకుంటున్నాయి.చాల మంది కమెడియన్స్ కు జబర్దస్త్ కామెడీ షో లైఫ్ ఇచ్చింది.ఈ షో నుంచి చాల మంది కమెడియన్స్ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.కమెడియన్స్ తో పాటు యాంకర్స్ కు కూడా ఈ కామెడీ షో లైఫ్ ఇచ్చిందని చెప్పచ్చు.
జబర్దస్త్ కామెడీ షో మొదలైనప్పటి నుంచి అనసూయ భరద్వాజ్,రష్మీ గౌతమ్ యాంకర్స్ గా తమ గ్లామర్ తో స్టేజి మీద వయ్యారాలు వలికిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.దాదాపుగా 9 సంవత్సరాల తర్వాత జబర్దస్త్ యాంకర్ గా అనసూయ భరద్వాజ్ ప్రస్థానం ముగిసిందని చెప్పచ్చు.అనసూయ స్థానంలో కొత్త అమ్మాయి జబర్దస్త్ యాంకర్ గా రావడం జరిగింది.షోలో పల్లకిలో ఎంట్రీ ఇచ్చిన ఈ యాంకర్ అందరి దృష్టిని ఆకట్టుకుంది.ఆ అమ్మాయి ఎవరా అంటూ అందరు అనుకుంటున్నా సమయంలో ఆమె పేస్ మాత్రం రివీల్ చేయలేదు షో నిర్వాహకులు.తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల కావడం జరిగింది.
అనసూయ ను మించిన అందాల రాశి ఎవరై ఉంటారు అనే దాని మీద అందరిలోనూ బాగా ఆసక్తి నెలకొంది.అనసూయ గత వారం జరిగిన ఎపిసోడ్ లో షో కు గుడ్ బాయ్ చెప్పడం జరిగింది.అనూహ్యంగా అనసూయ ఈ షో కు గుడ్ బాయ్ చెప్పి బయటకు వెళ్లిపోవడం అందరికి షాకింగ్ కు గురిచేసింది.ఈ షో నుంచి ఆమె వీడకుండా ఉండడానికి జడ్జిలు మరియు టీం లీడర్స్ చాల ప్రయత్నాలు చేసారు.జడ్జి గా వ్యవహరిస్తున్న ఇంద్రజ మిమ్మల్ని ఈ షో చాల మిస్ చేస్తుంది అంటూ చెప్పుకొచ్చారు.అయితే అనసూయ స్థానంలో రాబోయే కొత్త యాంకర్ గురించి ఇంకా అధికారిక సమాచారం రావలసి ఉంది.ఆగష్టు 4 న ప్రసారం అయ్యే కొత్త ఎపిసోడ్ లో యాంకర్ గురించి రివీల్ చేయనున్నారు షో నిర్వాహకులు.కార్తికేయ 2 సినిమా టీం అయినా హీరో నిఖిల్,దర్శకుడు చందు మొండేటి,శ్రీనివాసరెడ్డి ఈ షో కు హాజరుకావడం జరిగింది.