Home సినిమా Niharika Konidela: ప్రేమ గురించి ఆసక్తికరమైన పోస్ట్ పెట్టిన నిహారిక…చెప్పకనే చెప్పేసిందిగా..!

Niharika Konidela: ప్రేమ గురించి ఆసక్తికరమైన పోస్ట్ పెట్టిన నిహారిక…చెప్పకనే చెప్పేసిందిగా..!

0
Niharika Konidela
Niharika Konidela

Niharika Konidela: మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.నటిగా ఎంట్రీ ఇచ్చిన నిహారిక పలు సినిమాలలో హీరోయిన్ గా నటించింది.యూట్యూబ్ వెబ్ సిరీస్ లతో ఈమె మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.ఆ తర్వాత సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఒక మనసు,హ్యాపీ వెడ్డింగ్,సూర్య కాంతం వంటి సినిమాలలో హీరోయిన్ గా చేసింది.మూడేళ్ళ క్రితం నిహారిక పెళ్లి చేసుకుంది.

Niharika Konidela
Niharika Konidela

ఇక పెళ్లి తర్వాత ఈమె నిర్మాతగా కూడా మారింది.ఇక అంతా బాగుంది అనుకునే సమయంలో గత ఏడాది తన భర్త నుంచి విడాకులు తీసుకోని విడిపోతున్నట్లు చెప్పి అందరికి షాక్ ఇచ్చింది నిహారిక.తాజాగా నిహారిక ప్రేమ గురించి ఒక ఇంటరెస్టింగ్ పోస్ట్ పెట్టడం తో అది కాస్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

Also read : కమెడియన్ సుధాకర్ కుమారుడి పెళ్లి…వైరల్ అవుతున్న ఫోటోలు

Niharika Konidela
Niharika Konidela

మెగా డాటర్ నిహారిక యూట్యూబ్ వెబ్ సిరీస్ లతో ముఖ్యం గా పాపులారిటీని సంపాదించుకుంది.ఆ తర్వాత హీరోయిన్ గా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో పలు సినిమాలలో చేసింది.చిరంజీవి నటించిన సైరా సినిమాలో కొద్దీ సేపు కనిపించే గెస్ట్ రోల్ చేసింది.నిర్మాతగా పలు ఓటిటీ చిత్రాలు చేసింది నిహారిక.

Niharika Konidela
Niharika Konidela

చైతన్య అనే వ్యక్తిని 2020 లో పెళ్లి చేసుకుంది నిహారిక.మూడేళ్లు కలిసి ఉన్న తర్వాత గత ఏడాది చైతన్య తో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.ప్రస్తుతం ట్రావెల్స్ చేస్తూ సోలో లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న నిహారిక తాజాగా ఇంస్టా లో ప్రేమ గురించి ఒక పోస్ట్ పెట్టింది.నీకు కావాల్సింది ప్రేమ,బీచ్ మాత్రమే అని ఇంస్టా స్టోరీ లో ఫోటో పెట్టింది నిహారిక.

Niharika Konidela
Niharika Konidela

ఈ పోస్ట్ ను చుసిన నెటిజన్లు నిహారిక మల్లి ఏమైనా ప్రేమలో పడిందా..ఏమైనా హింట్ ఇస్తుందా అభిమానులకు అంటూ చెప్పుకుంటున్నారు.అయితే నిహారిక స్నేహితులు,కుటుంబసభ్యులను ఉద్దేశించి ఈ పోస్ట్ చేసినట్లు తెలుస్తుంది.

Niharika Konidela
Niharika Konidela

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here