Nirmalamma: వెయ్యికి పైగా సినిమాలలో బామ్మగా అలరించిన నిర్మలమ్మ యుక్త వయస్సులో యెంత అందంగా ఉందో చూడండి.!

NEWS DESK
1 Min Read
Nirmalamma

Nirmalamma: ఎక్కువగా బామ్మా పాత్రలు,అమ్మ పాత్రలు చేసే నిర్మలమ్మ అందరికి తెలిసే ఉంటుంది.1943 మొదటిసారి ఆమె చెలికత్తె పాత్రలో గరుడ గర్వభంగం అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఆ చిత్రంలో ఆమె వయస్సు పదహారు సంవత్సరాలు.నిర్మలమ్మ అసలు పేరు రాజమణి.అప్పటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్,ఏఎన్నార్,యస్వీ రంగారావు నుంచి ఇప్పటి స్టార్ హీరోలు అయినా చిరంజీవి,బాలకృష్ణ,వెంకటేష్ వంటి చాల మంది స్టార్ హీరోలకు అమ్మగా మరియు బామ్మగా నటించారు నిర్మలమ్మ.

Nirmalamma
Nirmalamma

సుమారు వెయ్యికి పైగా సినిమాలలో నటించిన నిర్మలమ్మ మయూరి,సీతారామరాజు వంటి చిత్రాలకు నంది అవార్డులను కూడా అందుకోవడం జరిగింది.ఆమె చివరగా మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన స్నేహం కోసం.ఆ తర్వాత ఆమె సినిమాలలో నటించలేదు.2009 లో నిర్మలమ్మ తనువు చాలించారు.అయితే నిర్మలమ్మ యుక్త వయస్సులో ఉన్న ఫోటోలు ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Nirmalamma
Nirmalamma

నిర్మలమ్మకు నాటకాల మీద ఉన్న ఇష్టంతో నాటకాలలో మంచి పాత్రలు కూడా చేసేవారంట.ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోయినా కూడా తన పెద్దనాన్న సపోర్ట్ తో నిర్మలమ్మ చాల సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.నిర్మలమ్మ 19 ఏళ్ళ వయసులో వివాహం చేసుకున్నారు.నిర్మలమ్మ యుక్తవయసులో ఉన్న చాల అందంగా ఉన్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *