తెలుగు సినిమా ప్రేక్షకులకు హీరోయిన్ నివేద థామస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తక్కువ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన హీరోయిన్లలో నివేద థామస్ ఒకరు.గుర్తుండిపోయే పాత్రలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు నివేద.అయితే గత కొంత కాలం నుంచి ఈమె ప్రేక్షకుల ముందుకు రాలేదని చెప్పచ్చు.నివేద థామస్ రెజీనా కాసాండ్రా తో కలిసి చేస్తున్న సినిమా శాకినీ డాకిని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్ కూడా చిత్ర యూనిట్ మొదలు పెట్టారు.
ఈ క్రమంలో రెజీనా కాసాండ్రా తో కలిసి నివేద థామస్ కూడా సినిమా ప్రమోషన్స్ లలో పాల్గొన్నారు.ఆమెను చూసిన అభిమానులు నివేద ఏంటి ఇలా అయిపొయింది అంటూ షాక్ అవుతున్నారు.బ్లాక్ కలర్ డ్రెస్ లో ఎంతో అందంగా కనిపిస్తున్న నివేద గతంలో కంటే లావుగా కనిపిస్తున్నారు.చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన నివేద థామస్ తెలుగు తో పాటు తమిళ్,మలయాళం భాషల్లో కూడా నటిస్తున్నారు.

మలయాళంలో వేరుతే ఓరు భార్య అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన నివేద థామస్ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకోవడం జరిగింది.ఆ సినిమాలోని పాత్రకు కేరళ రాష్ట్ర ఉత్తమ యువ నటి అవార్డును కూడా నివేద అందుకోవడం జరిగింది.రజినీకాంత్ కు కూతురిగా దర్బార్ మూవీ లో కూడా నివేద నటించడం జరిగింది.
View this post on Instagram