డైరెక్టర్ గా మారబోతున్న ఎన్టీఆర్…మొదటి సినిమా ఏ హీరోతోనో తెలుసా…

JR NTR

తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు.ట్రిపుల్ ఆర్ సినిమాలో కొమరం భీం పాత్రలో అద్భుతంగా అదరకొట్టిన ఎన్టీఆర్ కు వరల్డ్ వైడ్ గా ఫాలోయింగ్ పెరిగిపోయింది.ఇటీవలే ఇజ్రాయిల్ దేశం న్యూస్ పేపర్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎంట్రీ పాత్రను పొగుడుతూ ఒక పేజీ మొత్తం స్పెషల్ ఆర్టికల్ వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.ఆ తర్వాత కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ సినిమాల తర్వాత ఎన్టీఆర్ ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు తో కూడా సినిమా చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఎన్టీఆర్ అద్భుతంగా నటిస్తారు,డైలాగ్స్ చెప్తారు..అద్భుతంగా డాన్స్ చేస్తారు అనే సంగతి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే.అయితే ఎన్టీఆర్ లో మరో అద్భుతమైన టాలెంట్ ఏంటంటే ఆయన మంచి స్క్రిప్ట్ రైటర్ కూడా.తనకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కథలు రాయడం ఆయనకు అలవాటు.అయితే ఎన్టీఆర్ తన ఇద్దరు కొడుకుల పేరు మీద ఒక నిర్మాణ సమస్తాను ప్రారంభించి అందులో యువ హీరోలను పెట్టి సినిమాలు చేయబోతున్నారు అని సమాచారం.తాను నిర్మించబోయే సినిమాలకు కథను ఎన్టీఆరే రాస్తారట.

JR NTR
JR NTR

మొదటి సినిమాకు దర్శకత్వం కూడా ఎన్టీఆర్ వహిస్తారు అని సినిమా ఇండస్ట్రీలో గట్టిగ వార్తలు వస్తున్నాయి.వీటికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే ప్రకటించనున్నారని సమాచారం.అయితే ఇటీవలే టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ నిర్మాతగా మారి హీరో నితిన్ తో చల్ మోహన రంగ సినిమా చేసారు.అలాగే హీరో మహేష్ బాబు అడవి శేష్ హీరోగా మేజర్ అనే సినిమా చేసి హిట్ అందుకున్నారు.ఇక నాని హిట్ ఆ అనే సినిమా నిర్మించారు.ఇక హీరో రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ను నిర్మించి ఖైదీ నెంబర్ 150 ,సైరా నరసింహ రెడ్డి వంటి సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *