అన్ స్టాపబుల్ షో లో బాబాయ్ తో అబ్బాయిలు ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్…ఇక ఫ్యాన్స్ కు పండగే…ఎప్పుడంటే…


నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో సీజన్ 2 ఎవ్వరు ఊహించని రేంజ్ లో రోజు రోజుకు ప్రేక్షకాదరణ పొందుతుంది.దేశవ్యవాప్తంగా బిగ్గెస్ట్ టాక్ షో గా అవతరించబోతున్న ఈ షో మొదటి అయిదు ఎపిసోడ్స్ ఎలా ఉన్న కూడా చివరి మూడు ఎపిసోడ్స్ ఎవరు ఊహించని రేంజ్లో ఉండబోతున్నాయని తెలుస్తుంది.ఈ షో కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రావడం జరిగింది.ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ఎపిసోడ్ కు సంబంధించిన గ్లిమ్ప్స్ ను కూడా షో నిర్వాహకులు విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిందే.

ప్రభాస్ ముఖ్య అతిధిగా వచ్చిన ఈ షో ఎపిసోడ్ డిసెంబర్ 31 న ప్రసారం కానుందని తెలుస్తుంది.అయితే ఇదివరకు క్రేజీ స్టార్ హీరో అయినా పవన్ కళ్యాణ్ ఈ షో చివరి ఎపిసోడ్ కు రాబోతున్నారు అని ఆహా టీం ఇన్ డైరెక్ట్ గా వీడియొ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే.అయితే వైరల్ అవుతున్న ఆ వార్తలను నిజం చేస్తూ పవన్ కళ్యాణ్ త్వరలోనే డేట్స్ చెప్తానని షూటింగ్ సిద్ధం చేసుకోమని ఆహా టీం కి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.ఇక పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా వచ్చే ఈ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా రాబోతుందని సమాచారం.

అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఇంటర్వూస్ లో పాల్గొనే పవన్ కళ్యాణ్ బాలయ్య బాబు టాక్ షో లో పాల్గొనడం అనేది పెద్ద చర్చనీయాంశం గా మారిందని చెప్పచ్చు.ఈ షో కు పవన్ కళ్యాణ్ తో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా రాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ ఎపిసోడ్ తర్వాత బాలయ్య షో కు ఇద్దరు అబ్బాయిలు వస్తున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.బాలకృష్ణ టాక్ షో లో జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ వస్తున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.నందమూరి వారసులు ముగ్గురు ఒకే సారి కనిపిస్తే అభిమానులకు కన్నుల పండుగే అని చెప్పచ్చు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *