ఈ ఫొటోలోని బుడ్డోడు ప్రస్తుతం అభిమానులలో యమ క్రేజ్ ఉన్న మాస్ హీరో…ఎవరో తెలుసా…

NEWS DESK
1 Min Read

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చాల మంది హీరో,హీరోయిన్ ల చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇదే క్రమంలో ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న చాల మంది హీరోయిన్ల ఫోటోలు ప్రతి రోజు సామజిక మాధ్యమాల్లో కనిపిస్తూనే ఉన్నాయి.ఇప్పుడు ప్రస్తుతం తాజాగా ఒక యంగ్ హీరోకు సంబంధించిన చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 21 సంవత్సరాలు అవుతున్న ఈ హీరో గురించి ఫాన్స్ కు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

ఈ చిన్ననాటి ఫొటోలో ఉన్న హీరో ఎవరో కాదు…ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ చిత్రం తో థియేటర్లలో అభిమానులను అలరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్.కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ చిత్రంలో నట విశ్వరూపాన్ని చూపించారు.నిన్ను చూడాలని చిత్రంతో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఎన్టీఆర్.ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.ఇలా తన కెరీర్ స్టార్ట్ అయి నప్పటినుంచి చాల బ్లాక్ బస్టర్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నారు ఎన్టీఆర్.

JR NTR Childhood Pics
JR NTR Childhood Pics

ఆది,సింహాద్రి,యమదొంగ,అదుర్స్,బృందావనం,టెంపర్,నాన్నకు ప్రేమతో,జనతా గ్యారేజ్,జై లవకుశ,అరవింద సమేత వంటి చిత్రాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు ఎన్టీఆర్.ఇక తాజాగా ఎన్టీఆర్,రామ్ చరణ్ నటించిన ట్రిపుల్ ఆర్ చిత్రం మార్చ్ 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *