తన కెరీర్ లో ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 10 బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవే…

గుణశేఖర్ దర్శకత్వం వహించిన బాల రామాయణం అనే చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు జూనియర్ ఎన్టీఆర్.ఆ తర్వాత నిన్ను చూడాలని అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.మొదటి సినిమాతోనే నటన పరంగా మంచి గుర్తింపుతెచ్చుకున్న సినిమా మాత్రం అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.అయితే ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెం 1 చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు ఎన్టీఆర్.ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటన,డాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

ఆ తర్వాత ఆది,సింహాద్రి,యమదొంగ,రాఖీ,అదుర్స్,టెంపర్ వంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు.కెరీర్ లో కొన్ని పరాజయాలు పొందిన తన లోపాలను తెలుసుకొని హిట్స్ ను అందుకున్నారు.ఎన్టీఆర్ తన కెరీర్ లో వదిలేసినా సినిమాలలో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి.అయితే హిట్ అయినా సినిమాలను ఎన్టీఆర్ కథ నచ్చక వదిలేసారో లేక డేట్స్ కుదరక వదిలేసారో కానీ కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసారు.అవి ఏంటంటే….

ఆర్య:సుకుమార్ ఈ చిత్రం కథను ముందుగా ప్రభాస్ కు వినిపించారు.అయితే ప్రభాస్ రిజెక్ట్ చేయడంతో ఎన్టీఆర్ కు వినిపించారు సుకుమార్.కానీ అప్పట్లో ఎన్టీఆర్ కొంచెం బొద్దుగా ఉండటంతో ఆ క్యారక్టర్ కు తానూ సూట్ అవ్వను అని రిజెక్ట్ చేసారు.ఆ తర్వాత ఇదే కథను అల్లు అర్జున్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

దిల్:నితిన్ హీరోగా వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.అయితే ఈ చిత్రం కథను కూడా ముందుగా వినాయక్ ప్రభాస్ కు వినిపించారు.ప్రభాస్ నో చెప్పడంతో ఎన్టీఆర్ కు వినిపించారు.అయితే అప్పటికే ఎన్టీఆర్ వినాయక్ తో ఆది సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.ఎన్టీఆర్ ఈ సినిమాను రిజెక్ట్ చేసారు.

అతనొక్కడే:ఈ కథను మొదట ఎన్టీఆర్ కు వినిపించారు కానీ ఎన్టీఆర్ నో చెప్పడంతో కళ్యాణ్ రామ్ ఈ సినిమా చేసి హిట్ అందుకున్నారు.ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.

భద్ర:బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం కథను మొదట ఎన్టీఆర్ కు వినిపించారు.ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడంతో అల్లు అర్జున్ కు కూడా వినిపించారు.అయితే అల్లు అర్జున్ కూడా రిజెక్ట్ చేయడం తో రవి తేజ ఈ సినిమాతో హిట్ అందుకున్నారు.

కృష్ణ:వినాయక్ ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ తో కత్తి అనే టైటిల్ తో తీయాలి అనుకున్నారు.కానీ ఎన్టీఆర్ ఈ సినిమాను రిజెక్ట్ చేసారు.ఆ తర్వాత గుణశేఖర్ కత్తి అనే టైటిల్ తనది అని వినాయక్ కు చెప్పడంతో కృష అనే టైటిల్ తో రవితేజ తో సినిమా చేసి హిట్ అందుకున్నారు.

కిక్:సురేందర్ రెడ్డి ఈ చిత్రం కథను ప్రభాస్ కు వినిపించడం,ప్రభాస్ నో చెప్పడంతో ఎన్టీఆర్ కు వినిపించడం జరిగింది.ఎన్టీఆర్ కూడా నో చెప్పడంతో రవితేజ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.

ఎవడు:ముందుగా ఈ చిత్రాన్ని ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ చేద్దాం అనుకున్నారు కానీ వాళ్ళు డ్రాప్ అవ్వడం తో ఇదే కథను రామ్ చరణ్,అల్లు అర్జున్ చేసారు.

శ్రీమంతుడు:మహేష్ బాబు హీరోగా,కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.అయితే ఈ చిత్రం కథను ముందుగా ఎన్టీఆర్ కు వినిపించగా ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడంతో రామ్ చరణ్ కు వినిపించారు.కానీ రామ్ చరణ్ కూడా నో చెప్పడంతో మహేష్ బాబు ఈ సినిమా చేసి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.

ఊపిరి:ఈ చిత్రంలో నాగార్జున మరియు కార్తీ ముఖ్యపాత్రాలలో నటించారు.కార్తీ పాత్రలో ముందుగా ఎన్టీఆర్ ను అనుకున్నారు.కాని ఎన్టీఆర్ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయాలి అని అనడంతో కార్తీ తో సినిమా చేసారు.

బ్రహ్మోత్సవం:ఈ చిత్రం కథను ముందుగా ఎన్టీఆర్ కు వినిపించారు.కానీ అదే సమయంలో రామయ్య వస్తావయ్యా,రభస వంటి సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *