ఇండస్ట్రీలో ఒక హీరో చెయ్యాల్సిన సినిమా మరొక హీరో చేయడం అనేది సర్వసాధారణం.ముందుగా దర్శకుడు ఒకరిని ఉహించుకొని కథను రెడీ చేసిన ఆ తర్వాత ఆ హీరో రిజెక్ట్ చేయడమో లేదా వేరే ఇతర కారణాల వలన ఆ సినిమా మరొక హీరో దగ్గరకు వెళ్లడం జరుగుతుంది.అలా ఒక హీరో చెయ్యాల్సిన సినిమా మరొక హీరో చేసి హిట్ అయినా సందర్భాలు ఉన్నాయి..అలాగే ప్లాప్ అయినా సందర్భాలు కూడా ఉన్నాయి.అయితే అలా తాము రిజెక్ట్ చేసిన సినిమా హిట్ అయి ఉంటె బాడ్ లక్ అనుకుంటారు.
అదే ఒకవేళ ప్లాప్ అయి ఉంటె మనం ఊహించింది కరెక్ట్ అని అనుకుంటారు.ఈ క్రమంలో ఇప్పటి వరకు ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ప్లాప్ సినిమాలు చాలానే ఉన్నాయి.టెంపర్ సినిమా తర్వాత నుంచి ఎన్టీఆర్ కథలను ఎంచుకోవడంలో చాల జాగ్రత్త వహిస్తున్నారు.అందుకే ప్రస్తుతం ఎన్టీఆర్ వరుసగా హిట్స్ అందుకుంటున్నారు అని చెప్పచ్చు.ఇక ఎన్టీఆర్ ఇప్పటి వరకు రిజెక్ట్ చేసిన ప్లాప్ సినిమాలు ఏవంటే…
లైగర్:పూరీజగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రిలీజ్ అయినా లేటెస్ట్ సినిమా లైగర్.టెంపర్ సినిమాతో పూరీజగన్నాధ్ మరియు ఎన్టీఆర్ ఇద్దరు కూడా హిట్ అందుకున్నారు.దాంతో మరొక సినిమాను ఎన్టీఆర్ తో చెయ్యాలని భావించిన పూరి బాక్సింగ్ కథతో ఎన్టీఆర్ ను కలిశారు.కానీ ఆ కథ ఎన్టీఆర్ కు నచ్చకపోవడంతో ఎన్టీఆర్ రిజెక్ట్ చేసారు.చివరకు నాలుగు సంవత్సరాల తర్వాత పూరి ఇదే కథను విజయ్ దేవరకొండలో తీసి ప్లాప్ అందుకున్నారు.
నా పేరు సూర్య:ఈ సినిమా కథ ముందుగా ఎన్టీఆర్ దగ్గరకే వెళ్లిందట.టెంపర్ కథను రాసిన వక్కంతం వంశి కి ఎన్టీఆర్ మంచి కథ ఉంటె రెడీ చేసుకో డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానని చెప్పారట.కానీ ఆ కథ కాస్త ఎన్టీఆర్ కు నచ్చకపోవడంతో అల్లు అర్జున్ దగ్గరకు వెళ్ళింది.ఇక ఈ సినిమా కూడా ప్లాప్ అయ్యింది.
బ్రహ్మ్మోత్సవం:అప్పటి వరకు హిట్స్ అందుకుంటున్న మహేష్ బాబు కు ఈ సినిమాతో బ్రేక్ పడింది అని చెప్పా వచ్చు.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాతో హిట్ ఇచ్చాడు అనే నమ్మకంతో కథ పూర్తిగా వినకుండా మహేష్ బాబు ఈ సినిమాను చేసారు.ఈయన కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచింది.అయితే ఈ కథను శ్రీకాంత్ ముందుగా ఎన్టీఆర్ కు వినిపించారు.కానీ ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడంతో మహేష్ బాబు తో ఈ సినిమా చేసారు.
శ్రీనివాస కళ్యాణం:నితిన్ హీరోగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన చిత్రం శ్రీనివాస కళ్యాణం.ఈ సినిమా కథ కూడా ముందుగా ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లిందట.అయితే ఈ కథ బోరింగ్ గా ఉందని ఎన్టీఆర్ రిజెక్ట్ చేసారు.చివరకు అది కూడా ప్లాప్ ను సొంతం చేసుకుంది.