ఇజ్రాయిల్ దేశంలో ఎన్టీఆర్ క్రేజ్….న్యూస్ పేపర్ లో ఒక పేజీ మొత్తం ఎన్టీఆర్ గురించి స్పెషల్ ఆర్టికల్….

Jr NTR israel

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు.ఈ చిత్రం లో రామ్ చరణ్ రామ రాజు పాత్రలో మరియు ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.ఈ చిత్రం 1150 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి ఘన విజయం అందుకుంది.ప్రముఖ ఓటిటి లు అయినా జీ 5 ,నెట్ ఫ్లిక్ లలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.ఓటిటి లలో కూడా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందని చెప్పచ్చు.

జూనియర్ ఎన్టీఆర్ కు రెండు తెలుగు రాష్ట్రాలలోని కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాల ఫాలోయింగ్ ఉంది.జపాన్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక తాజాగా ఇజ్రాయిల్ న్యూస్ పేపర్ లో తారక్ గురించి ఒక పేజీ మొత్తం స్పెషల్ ఆర్టికల్ ప్రచురితమయింది.ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలలో మరియు యాక్షన్ సన్నివేశాలలో తారక్ నటించిన తీరు గురించి గొప్పగా చెప్తూ ఒక పేజీ మొత్తం ఆర్టికల్ రాయడం జరిగింది.

Jr NTR israel
Jr NTR israel

ఇజ్రాయిల్ దేశంలో తారక్ కు ఉన్న క్రేజ్ చూసి ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇజ్రాయిల్ దేశం లో తారక్ హవా మాములుగా లేదని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఎన్టీఆర్ సోషల్ మీడియా లో యాక్టీవ్ గా లేనప్పటికీ ఆయన సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ ఉంది.తారక్ తన భవిష్యత్తు సినిమాలతో కూడా సంచలనాలు క్రియేట్ చేస్తారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *