మెగాస్టార్ చిరంజీవి మేనళ్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.భారీ హిట్ కోసం సాయి ధరమ్ తేజ్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు.తాజాగా ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ కు కూడా ఓకే చెప్తున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్.ప్రస్తుతం సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ వినోదయ సిత్తం రీమేక్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో సాయి ధరమ్ తేజ్ పాల్గొనడం జరిగింది.
అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.మరో పక్క పవన్ కళ్యాణ్ రాజకీయ ఎజెండా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది.అయితే కథ పరంగా పవన్ పాత్ర నిడివి తక్కువే ఉంటుందని అందుకే పవన్ ఈ రీమేక్ కు ఒప్పుకున్నారని సమాచారం.పవన్ ఈ సినిమాకు డేట్స్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు.మరోపక్క సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా షూటింగ్ కోసం మరో సినిమా షూట్ ను మొదలుపెట్టలేదు.

అయితే సోలో గా సినిమా చేసినట్లయితే ఎక్కువ డేట్స్ ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు ఈ సినిమా షూట్ కు సమస్య వస్తుంది అని భావించి సాయి ధరమ్ తేజ్ మరో సినిమాకు ఓకే చెప్పలేదు.అయితే తాజాగా మరో గెస్ట్ రోల్ ను సాయి ధరమ్ తేజ్ ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి.కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరో గా తెరకెక్కుతున్న సినిమాలో సాయి ధరమ్ తేజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం.అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్,తేజ్ బావ బావమరుదులు పాత్రలో నటిస్తున్నారని సమాచారం.
అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు సెకండ్ హీరోయిన్ గా చేస్తున్న పాత్రకు తేజ్ అన్నయ్య పాత్రలో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.మరో ఇంటరెస్టింగ్ విషయం ఏంటంటే…తన చెల్లి ప్రేమను గెలిపించడానికి సాయి ధరమ్ తేజ్ మెయిన్ హీరోయిన్ పై అటాక్ చేసే యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయని చెప్తున్నారు.ఈ సినిమా కోసం నిర్మాతలు రూ 300 కోట్లు ఖర్చు చేస్తున్నారు.యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని తెలుస్తుంది.దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త యాక్షన్ ట్రీట్ ను ఇవ్వడానికి హాలీవుడ్ యాక్షన్ టెక్నీషియన్స్ ను పెట్టుకున్నారని సమాచారం.