ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు బ్యానర్ ఉషా కిరణ్ మూవీస్ పై వచ్చిన యూత్, లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘నువ్వే కావాలి’. 13 అక్టోబర్, 2000లో వచ్చిన ఈ మూవీ అప్పటి కుర్రకారుతో పాటు పెద్దలను సైతం ఆకట్టుకుంది. ఇద్దరు చిన్ననాటి స్నేహితుల మధ్య నడిచే లవ్, ఇరువైపులా పెద్దలు సైతం మంచి ఫ్రెండ్స్ కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టకుంది. ఇక కోటి మ్యూజిక్ సమకాలంలో మ్యాజిక్ చేసిందనడంలో సందేహం లేదు.చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొందిన నటుడు తరుణ్. ఆయనతో జత కట్టిన భామ రిచ పల్లాడ్. రిచ కూడా బాలనటే 1991లో లమ్హే, 1997లో పర్దేస్ సినిమాల్లో బాలనటిగా మంచి పేరు గడించింది ఈ భామ.
తర్వాత తెలుగు తెరపై అరెంగేట్రం చేసిన రిచ నువ్వే కావాలిలో ఉత్తమ ప్రతిభ చూపింది. దీనికి గానూ ఆమెకు ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా దక్కింది. కానీ తరువాత ఆమెకు అంత మంచి గుర్తింపు ఉన్న సినిమాలు రాలేదు. పెద్ద హీరోలతో నటించేంత ఫిజిక్ ఆమెకు లేకపోవడంతో ఉన్న వారిలో పెద్ద హీరో అయిన శ్రీకాంత్ తో మాత్రమే నటించింది. తర్వాత వచ్చిన రెండు, మూడు సినిమాలు చిరుజల్లు, మనసిస్తారా లాంటివి నువ్వే కావాలి దరిదాపులకు కూడా రాలేకపోయాయి.

తన ఫస్ట్ పెయిర్ తరుణ్ తో కలిసి నటించిన చిరుజల్లు కూడా ఆశించినంత ఆడలేదు. దీంతో ఇండస్ర్టీలో గుర్తింపు తెచ్చుకోవాలంటే ఆ హీరోయిన్, హీరోకు కొన్ని క్వాలిటీస్ తప్పనిసరి, కని ఆమెలో అవి లేకపోవడంతో కెరీర్ లో వెనుకబడింది. నువ్వే కావాలి తర్వాత వరుస ప్లాప్ లతో ఇండస్ర్టీలో కనిపించకుండా పోయింది. రంగుల లోకం హిట్లను మాత్రమే గుర్తుంచుకుంటుంది. ప్లాప్ లతో నడిచే వారిని పట్టించుకోదు అనే మాటలకు రిచ పల్లాడ్ మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక్క సినిమాతో తలుక్కుమన్న తారలు, ఇండస్ర్టీ దరిదాపులకు రాకుండాపోయిన వారెందరో..
