నువ్వునాకునచ్చావ్ ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా…


వెంకటేష్,ఆర్తి అగర్వాల్ జంటగా విజయభాస్కర్ తెరకెక్కించిన చిత్రం నువ్వునాకునచ్చావ్.2000 సంవత్సరంలో రిలీజ్ అయినా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.చాల చోట్ల 100 రోజులు,50 రోజులు పూర్తి చేసుకొని బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచింది.ఇప్పటికి ఈ సినిమా ఇప్పటికి టీవీ లో ప్రసారం అయితే చూసే ప్రేక్షకులు చాల మందే ఉన్నారు.ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్,చంద్రమోహన్,సుహాసిని,ఏం ఎస్ నారాయణ,బ్రమ్మానందం తది తరులు కీలక పాత్రలు పోషించారు.ఈ సినిమాకు కోటి అందించిన సంగీతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.మరో వైపు హీరో హీరోయిన్ మధ్య లవ్ డ్రామా,త్రివిక్రమ్ మాటలు,బ్రమ్మానందం కామెడీ అన్ని ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.

ఈ చిత్రం వెంకటేష్ కెరీర్ లో బెస్ట్ చిత్రం అని చెప్పచ్చు.ఈ సినిమాలో హీరో పాత్రను వెంకటేష్ తప్ప మరెవరు చేయలేరు అన్నంతగా వెంకటేష్ ఈ పాత్రలో నటించారు.అయితే దర్శకుడు విజయభాస్కర్ ఈ సినిమాకు హీరోగా వేరే హీరోను అనుకున్నారు.నువ్వేకావాలి సినిమాతో హిట్ అందుకున్న తరుణ్ ను నువ్వునాకునచ్చావ్ సినిమాలో చేయాలనీ దర్శకుడు విజయభాస్కర్ తరుణ్ ను అడగడం జరిగింది.

అయితే తరుణ్ డేట్లు కుదరడం లేదు అని రిజెక్ట్ చేయడంతో త్రివిక్రమ్ వెంకటేష్ పేరును చెప్పడం జరిగింది.దాంతో విజయభాస్కర్ వెంకటేష్ ను ఫైనల్ చేసారు.ఈ సినిమాకు రెండు కోట్ల బడ్జెట్ పెట్టగ 18 కోట్ల వసూళ్లను రాబట్టింది.అయితే ఈ సినిమాను రిజెక్ట్ చేసిన తరుణ్ నువ్వులేక నేనులేను,ప్రియమైన నీకు,అదృష్టం వంటి చిత్రాలలో నటించడం జరిగింది.అందులో నువ్వులేకనేనులేను,ప్రియమైన నీకు చిత్రాలు హిట్ అయితే అదృష్టం చిత్రం ప్లాప్ అవ్వడం జరిగింది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *