Home » సినిమా » నువ్వునాకునచ్చావ్ పింకీ ఇప్పుడు యెంత అందంగా ఉందో..ఏం చేస్తుందో తెలుసా…

నువ్వునాకునచ్చావ్ పింకీ ఇప్పుడు యెంత అందంగా ఉందో..ఏం చేస్తుందో తెలుసా…

హీరో వెంకటేష్,ఆర్తి అగర్వాల్ జంటగా తెరకెక్కిన చిత్రం నువ్వు నాకు నచ్చావ్.ఈ చిత్రంలోని ప్రతి క్యారెక్టర్ ప్రతి డైలాగ్ కూడా ప్రేక్షకులకు ఇప్పటికి కూడా బాగా గుర్తుండిపోతుంది.ఈ సినిమా వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికి కూడా బుల్లితెర మీద ప్రసారం అయితే చూసే ప్రేక్షకులు చాల మందే ఉన్నారు.అయితే ఈ సినిమాలో హీరో,హీరోయిన్ లతో పాటు గుర్తుండిపోయే మరొక క్యారెక్టర్ పింకీ.

ఈ చిత్రం లో పింకీ హీరోయిన్ కు చెల్లెలిగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.పింకీ అసలు పేరు సుదీప.నువ్వు నాకు నచ్చావ్ చిత్రం తర్వాత సుదీప బొమ్మరిల్లు,స్టాలిన్,బిందాస్,మిస్టర్ పర్ఫెక్ట్,లెజెండ్ వంటి పలు హిట్ చిత్రాలలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.అలాగే బుల్లితెర మీద ప్రసారం అయినా పలు సీరియల్స్ లో కూడా సుదీప నటించి బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా ఆకట్టుకుంది.

సుదీప ఎంబీఏ వరకు చదువుకుంది.ప్రస్తుతం సాఫ్ట్ వెర్ ఇంజినీర్ అయినా శ్రీరంగనాథ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని హైదరాబాద్ లో సెటిల్ అయ్యింది సుదీప.పెళ్లి చేసుకున్న తర్వాత సుదీప సినిమాలకు దూరంగా ఉంటుంది.సుదీప కు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్నాయి.ఆ లేటెస్ట్ ఫోటోలలో సుదీప తన అందంతో అందరిని ఆకట్టుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *