Home సినిమా ఒకేసారి 5 సినిమాలు ఓకే చేసిన రవితేజ..రెమ్యూనరేషన్ కూడా అదిరిపోయే రేంజ్ లో..ఆ సినిమాలు ఇవే…

ఒకేసారి 5 సినిమాలు ఓకే చేసిన రవితేజ..రెమ్యూనరేషన్ కూడా అదిరిపోయే రేంజ్ లో..ఆ సినిమాలు ఇవే…

0

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరియు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసే వారు రవితేజ.ఆ తర్వాత పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఇడియట్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ మాస్ మహారాజ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు రవి తేజ.అయితే ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేక స్లో గా ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్న రవి తేజ మల్లి ఒక్కసారిగా క్రాక్ హిట్ అందుకున్న తర్వాత స్పీడ్ పెంచారు.వరుసగా సినిమాలకు ఓకే చెప్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు రవి తేజ.మాస్ మహారాజ్ తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు కూడా క్యూ కడుతుండడంతో వరుసగా సినిమాలు ఓకే చేస్తున్నారు రవి తేజ.

అయితే ప్రస్తుతం ఒకేసారి రవి తేజ అయిదు సినిమాలు చేస్తున్నట్లు సమాచారం.ఒకేసారి ఇన్ని సినిమాలకు కమిట్ అయినా రవి తేజ మరి డేట్స్ ఎలా ఎడ్జస్ట్ చేస్తారో తెలియాల్సి ఉంది.కానీ చిత్ర పరిశ్రమలో మాత్రం రవితేజ స్పీడ్ చూసి ఆశ్చర్య పోతున్నారు సినిమా ప్రముఖులు.అయితే రవి తేజ ప్రతి సినిమాకు కూడా పది కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.చిన్న దర్శకులతో పాటు కొత్త వాళ్లకు కూడా సినిమా ఓకే చేస్తున్నారు రవి తేజ.
ఖిలాడీ:రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 22 న విడుదల కానుంది.
రామారావు ఆన్ డ్యూటీ:ఈ చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలో రవితేజ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ధమాకా:ఈ చిత్రానికి త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.టైగర్ నాగేశ్వరరావు:ఈ చిత్రం స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బియోపిక్.ఈ చిత్రాన్ని వంశి తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రం తమిళం,మలయాళం,కన్నడ,హిందీ భాషలలో విడుదల కానుంది.ఈ చిత్రం కోసం రవి తేజ 18 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.రావణాసుర:ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.వచ్చే సంవత్సరం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొదలుకానుంది.ఈ చిత్రంలో రవితేజ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here