చాల మంది సినిమా ఇండస్ట్రీ కి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమయ్యి హీరో హీరోయిన్ లుగా స్థిరపడిపోయారు.కొందరు మాత్రం అరకొరగా ఒకటి రెండు సినిమాలు చేసి ఆ తర్వాత కనుమరుగైపోయారు.కానీ ప్రేక్షకులకు మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో అనే ఆసక్తి బాగానే ఉంటుంది.దింతో చాల సినిమాలలో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ ల ఇప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో రోజు కనిపిస్తూనే ఉన్నాయి.అదే కోవలో ఒక్కడు సినిమాలో మహేష్ బాబు చెల్లెలిగా చేసిన అమ్మాయి తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది.
ఆ అమ్మాయి పేరు నిహారిక.2003 లో రిలీజ్ అయినా ఒక్కడు సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఈ సినిమాలో మహేష్ బాబు కు జోడిగా భూమిక నటించారు.బేబీ నిహారిక హీరో మహేష్ బాబుకు చెల్లెలిగా ఆశ అనే క్యారక్టర్ లో నటించింది.ఈ పాత్ర నిహారిక కు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.ఒక్కడు సినిమాకు ముందు నిహారిక మోహన్ బాబు హీరోగా చేసిన యమజాతకుడు అనే సినిమాలో మోహన్ బాబు మేనకోడలిగా చేసింది.
అలాగే వెంకటేష్ హీరోగా చేసిన ప్రేమించుకుందాం రా అనే చిత్రంలో కూడా నిహారిక చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది.ఆ తర్వాత నిహారిక మంచి మంచి అవకాశాలు వచ్చిన కూడా నో చెప్పి తన ఫోకస్ మొత్తం చదువుల పైనే పెట్టింది.ఇప్పుడు ప్రస్తుతం తన చదువు పూర్తి చేసుకున్న నిహారిక మల్లి సినిమా అవకాశాల కోసం ఫోటో షూట్ చేసింది.ప్రముఖ దర్శకుడు నిహారికకు అవకాశం ఇస్తానని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
View this post on Instagram