చాల మంది తమ ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ద తీసుకుంటూ ఉంటారు.సరైన సమయంలో తినడం,నిద్రపోవడంతో పాటు జిమ్ కు ఫిట్ నెస్ కోసం కసరత్తులు కూడా చేస్తుంటారు.ఆహారంలో మంచి హెల్త్య్ డైట్ ఫాలో అవుతూ ఉంటారు.ఉదయాన్నే లేచి మంచి ఆరోగ్యం కోసం జాగింగ్,యోగ కూడా చేస్తుంటారు చాల మంది.ఈరోజుల్లో యువకుల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా మంచి ఆరోగ్యం కోసం కసరత్తులు చేస్తున్నారు.
కొంత మంది అయితే ఇంట్లోనే డంబెల్స్ తెచ్చుకొని ప్రతిరోజూ కసరత్తు చేస్తూ ఉంటారు.తాజాగా ఒక బామ్మా తన మనవడితో కలిసి కసరత్తులు చేసిన వీడియొ ఒకటి సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.82 ఏళ్ళు ఉన్న ఒక బామ్మా తన మనవడు టెర్రస్ మీద జిమ్ చేస్తుండగా వెళ్ళింది.తన మనవడు సవాల్ విసిరాడో ఏమో కానీ 80 కేజీల డంబెల్ ను అవలీలగా ఎత్తింది బామ్మ.
ఒత్తిడి లేకుండా డంబెల్ ను ఎత్తి ఆ తర్వాత మెల్లగా కిందకు దింపింది.ప్రస్తుతం బామ్మా చేసిన ఈ వర్క్ ఔట్స్ వీడియొ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.ఈ వీడియొ చుసిన నెటిజన్లు వావ్ బామ్మా భలేగా వర్క్ ఔట్స్ చేసింది అంటూ కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.82 ఏళ్ళ వయస్సులో బామ్మా అన్ని కేజీల డంబెల్ ఎత్తడంతో నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు.
View this post on Instagram