హీరోయిన్లకు సినిమా ఇండస్ట్రీలో కొదవ అంటూ ఎప్పటికి ఉండదు.చాల మంది సినిమా అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు.ఎంతమందికి అవకాశాలు వచ్చిన తమని తాము నిరూపించుకొని సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే వాళ్ళు చాల తక్కువ మంది ఉంటారు అని చెప్పచ్చు.సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు చాల మంది హీరోయిన్లు పరిచయం అవుతూ ఉంటారు.ఇలా పరిచయం అయినా హీరోయిన్లలో చాల మంది ముంబై కి చెందిన వాళ్లే ఉంటారు.కొంత మంది మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలతో స్టార్ హీరోయిన్లుగా ఎదిగారు.
కానీ కొంత మంది మాత్రం మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కూడా ఆ తర్వాత కనుమరుగైపోతున్నారు.ఒక్క సినిమాతో తళుక్కున మెరిసి ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైనా హీరోయిన్లు చాల మందే ఉన్నారు.అలా వచ్చిన హీరోయిన్లలో షాజన్ పదంసీ కూడా ఒకరు అని చెప్పచ్చు.భాస్కర్ బొమ్మరిల్లు సినిమాకు దర్శకత్వం వహించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేసిన సినిమా ఆరెంజ్ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కానీ ఎన్నో అంచనాలతో రిలీజ్ అయినా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ ను సొంతం చేసుకుంది.ఆరెంజ్ సినిమాలో హీరో ఫ్లాష్ బ్యాక్ లో హీరోకు జోడిగా నటించిన హీరోయిన్ షాజన్ పదంసీ.ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో ఈమెకు అవకాశాలు రాలేదు అని చెప్పచ్చు.

ఈమె రాకెట్ సింగ్ సేల్స్ మ్యాన్ ఆఫ్ థీ ఇయర్ అనే హిందీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.తెలుగులో ఆరెంజ్ సినిమా తర్వాత హీరో రామ్ కు జోడిగా మసాలా సినిమాలో నటించింది.ప్రస్తుతం షాజన్ మోడలింగ్ రంగంలో బిజీ గా గడుపుతుంది.షాజన్ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.