Home రివ్యూలు Ori Devuda Movie Review: సినిమా రివ్యూ..

Ori Devuda Movie Review: సినిమా రివ్యూ..

0
Ori Devuda Movie Review
Ori Devuda Movie Review

ఇప్పడున్న యువ కథానాయకులు రొటీన్‌కు భిన్నమైన కథలను ఎంచుకుంటున్నారు. వారికి ఫాలోయింగ్ సైతం ఆలాగే ఉంటోంది. ఇందులో ప్రధానంగా వినిపించే పేరు విశ్వక్ సేన్. ‘ఫలక్ నామా దాస్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యువ హీరో డిఫరెంట్ ఆటిట్యూడ్ చూపిస్తూ యువతను తన వైపు తిప్పుకునేలా చేసుకున్నారనడంలో సందేహం లేదు. ఆ తర్వాత మర్డర్ మిస్టరీ ఛేదించిన ‘హిట్’తో డిఫరెంట్ రోల్ కనిపించాడు. పాగల్ సినిమా ప్రమోషన్ లో ఓ టీవీ యాంకర్ తో జరిగిన గొడవ ఆయనకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ నటుడు హీరోగా తీసిన మరో సినిమా ‘ఓరి దేవుడా’ అక్టోబర్ 21 (శుక్రవారం) విడుదలైంది. చిత్ర విశేషాలేంటో షాట్ గా చూద్దాం.

కథ విషయానికి వస్తే

కథ విషయానికి వస్తే అర్జున్ (విశ్వక్ సేన్), అను చిన్నప్పటి ఫ్రెండ్స్. అను తనను పెండ్లి చేసుకోమని అర్జున్ ను అడుగుతుంది. దీంతో అర్జున్ కన్ఫూజన్ అవుతాడు. అందులో నుంచి తేరుకోకముందే ఇరు వైపుల పెద్దలు ముహూర్తాలు ఫిక్స్ చేస్తారు. పెండ్లి తర్వాత అనును మంచి ఫ్రెండ్ లాగే చూస్తాడు అర్జున్. తనతో కలిసి జీవితాంతం ఉండలేనని అనుతో చెప్తాడు. తన సినియర్ అయిన మీరా పరిచయమవుతుంది. ఆమెపై ప్రేమ ఉందనుకుంటాడు. ఇలా కథ ముందుకు వెళ్లే కొద్దీ నిజమైన ప్రేమ ఎక్కడుందో తెలుసుకుంటాడు. కథ రోటీనే అయినా కొత్తగా తెరకెక్కించారు డైరెక్టర్ అశ్వత్ మరిమత్తు. 

నటులు 

వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వీ పొట్లూరి, పరం వీ పొట్లూరి నిర్మాతలుగా వ్యవహరించారు. చిత్రంలో విశ్వక్ సేన్ తో పాటు వెంకటేశ్, విథిలా పాల్కర్, ఆశాభట్, రాహుల్ రామకృష్ణ, నాగినీడు, మురళీ శర్మ వారి వారి పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్ సంగీతం కుర్రకారును ఉర్రూతలూగించిందనడంలో సందేహం లేదు. 

మూవీ ఎలా ఉందంటే..?

ఈ మూవీ తమిళంలో హిట్ అయిన ‘ఓ మై కడవులే’ రిమేక్. తెలుగుకు వచ్చే వరకు పెద్దగా మార్పులు చేయలేదు. ఒకటి, రెండు సన్నివేశాలు కొత్తవి యాడ్ చేశారు. దీన్ని నితిన్, కిర్తి సురేశ్ నటించిన ‘రంగ్ దే’తో చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. ఇక దగ్గుబాటి వెంకటేశ్ అతిథి పాత్ర ఆకట్టుకుంటుంది. కథ రోటీనే అయినా ట్విస్టు మాత్రం రివీల్ అవుతూనే ఉంటాయి. స్ర్కీన్ ప్లే ఆకట్టుకుంటుంది. కాని స్లోగా వెళ్తుంది. కోర్టు సీన్స్, వెంకటేశ్, విశ్వక్ సేన్ మధ్య సన్నివేశాలు హ్యూమరస్ గా ఉంటాయి. ఇప్పటి యువతను సీటుకు అతుక్కునేలా చేస్తుంది. 

నటుల ఫర్మార్మెన్స్

విశ్వక్ సేన్ చాలా ఎనర్జటిక్ గా నటించారు. కొన్ని సన్నివేశాలు మాత్రం కొంత బోర్ కట్టించేవిగా మలిచారు. దీనికి కొంత మైనస్ విశ్వక్ సేన్ ఫిజిక్ మిథిలా పాల్కర్ మంచి స్కోప్ ఉన్న పాత్రనే చేసింది. డైరెక్ట్ గా తెలుగు సినిమాలో నటించడం కొత్తయినప్పటికీ కనిపించనీయకుండా యాక్ట్ చేసింది. ఇక రాహుల్ రామకృష్ణ వెంకటేశ్ అసిస్టెంట్ గా ఇరగదీశాడు. ఆశా భట్ ను గ్లామర్ కోసమే తీసుకున్నట్లు అనిపిస్తుంది. 

చిత్ర యూనిట్

ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ మ్యూజిక్ చక్కగా సరిపోయింది. తమిళ రాక్ స్టార్ అనిరుథ్ పాటలను యువతను హాల్ లో డ్యాన్స్ చేయించాయి. విధు అయ్యనా ఫొటోగ్రఫీ డీసెంట్. రోటీన్ కథే అయినా వినోదం మేళవించి, ఫ్యామిలీతో చూసే మంచి సినిమా అనే చెప్పొచ్చు. ఇక వీఎఫ్ఎక్స్ చాలా వీక్ గా ఉంది. చాలా సన్ని వేశాల్లో ఇక్కడ గ్రాఫిక్స్ చేశారు అన్నట్లు కనిపిస్తుంది. 

రేటింగ్: 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here