పక్క కమర్షియల్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్…సినిమా ఎలా ఉందంటే…

Pakka Commercial Movie Review

సిటిమార్ అనే చిత్రం తర్వాత గోపీచంద్ నటించిన చిత్రం పక్క కమర్షియల్.ఈ చిత్రం జులై 1 న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ చిత్రంలో గోపీచంద్ కు జోడిగా అందాల ముద్దు గుమ్మా హీరోయిన్ రాశిఖన్నా నటిస్తుంది.హీరో గోపీచంద్ చాల రోజుల నుంచి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.సిటిమార్ సినిమా హిట్ అయినప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వలేదు.దాంతో గోపీచంద్ పక్క కమర్షియల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలి అన్న కసితో ఉన్నారు.అందుకే ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపించనున్నారు గోపీచంద్.కేవలం హీరో గోపీచంద్ కోసమే దర్శకుడు మారుతి ఈ సినిమా కథను రాసుకున్నారట.ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయినా టీజర్,సాంగ్స్ అన్ని కూడా ఈ సినిమాపై ఆసక్తిని కలుగజేస్తున్నాయి.ఈ సినిమా థియరిటికల్ బిజినెస్,ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగాయని సమాచారం.గీత ఆర్ట్స్ మరియు యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించటం జరిగింది.

Pakka Commercial Movie Review
Pakka Commercial Movie Review

సినిమా రివ్యూ:
నటీనటులు:గోపీచంద్,రాశిఖన్నా,సత్యరాజ్,అనసూయ భరద్వాజ్,రావురమేష్,సప్తగిరి తదితరులు.

దర్శకుడు:మారుతి

సంగీతం:జెక్స్ బెజోయ్

నిర్మాత:బన్నీ వాసు

సినిమాటోగ్రఫీ:కరం చావ్లా

కథ:ఈ సినిమా కథ మొత్తం లాయర్లు,కోర్టు,కేసుల చుట్టూ తిరుగుతుంది.కోర్టు చుట్టూ ఈ సినిమా కథ తిరిగిన కూడా దానిలోనే కామెడీ ని జనరేట్ చేసారు దర్శకుడు మారుతి.ఈ సినిమా లో గోపీచంద్ లాయర్ గా  నటించారు.ఈ సినిమాలో హీరో గోపీచంద్ తండ్రి జడ్జి గా ఎన్నో కేసులు వాదించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు.సత్యరాజ్ కొడుకు అంటే గోపీచంద్ మాత్రం పక్క కమర్షియల్.వీరిద్దరి అభిప్రాయాలూ వేరుగా ఉండడం వలన వీరిద్దరి మధ్య విబేధాలు వస్తుంటాయి.ఒక మిస్టరీ కేసు వలన కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మల్లి లాయర్ గా చేరుతారు రామ్ చాంద్ (గోపీచంద్).సీరియల్ నటి అయినా రాశిఖన్నా కి లాయర్ రోల్ చేసే అవకాశం వస్తుంది.అసిస్టెంట్ గా హీరో గోపీచంద్ దగ్గర జాయిన్ అవుతుంది రాశిఖన్నా.ఇక వీరిద్దరి మధ్య ప్రేమ..?ఆ మిస్టరీ కేసు ఏంటి..హీరో ఎలా ఆ మిస్టరీ కేసు సాల్వ్ చేస్తాడు అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:మారుతి రాసుకున్న ఈ కథకు హీరో గోపీచంద్ సరిగా సూట్ అయ్యారు అని చెప్పచ్చు.సినిమా కథ మొత్తం కోర్టుల చుట్టూ తిరిగిన కూడా అందులో కామెడీ జెనెరేట్ చేయడం లో సక్సెస్ అయ్యారు మారుతి.ఇక హీరో గోపీచంద్ మొత్తం సినిమాను తన భుజాలపై మోశాడు అని చెప్పచ్చు.ఇక ఈ సినిమాలో ముఖ్యపాత్రాలలో నటించిన రావురమేష్,సప్తగిరి,వరలక్ష్మి శరత్ కుమార్ అందరు కూడా తమ పాత్రలకు న్యాయం చేసారు అని చెప్పచ్చు.ఇక హీరోయిన్ గా రాశిఖన్నా బాగానే మరోసారి తన సత్తా చాటింది అని చెప్పచు.ఫుల్ తో కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులు ఆశించిన విధంగానే ఈ సినిమా ఉందని చెప్పచ్చు.

రేటింగ్:4 /5 .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *