జూన్ 30 లోపు పాన్ కార్డు,ఆధార్ కార్డు లింక్ చేయాలి…లేకపోతె డబుల్ జరిమానా…

పాన్ కార్డు ఉన్నవారు జూన్ 30 వ తేదీ లోపు పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలి.ఆదాయపు పన్ను శాఖా వారు ఇప్పటికే పలు సార్లు గడువు పాడించిన సంగతి తెలిసిందే.2021 సెప్టెంబర్ 30 వ తేదీ వరకు ఉన్న గడువును 2022 మార్చ్ 31 వ తేదీ వరకు పొడిగించడం జరిగింది.ఆ తర్వాత 2022 ఏప్రిల్ 1 వ తేదీ నుంచి పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలి అని అనుకున్నవారు రూ.500 చెల్లించాలి.జూన్ 30 వరకు పాన్ కార్డును ఆధార్ కార్డును లింక్ చేయాలి అనుకున్నవారు రూ 500 చెల్లించాలి.ఆ తర్వాత జులై 1 నుంచి ఈ ఫైన్ రెట్టింపు అవుతుంది.జులై 1 నుంచి పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలి అనుకున్నవారు రూ 1000 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది అని సీబీడీటీ ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది.

Advertisement

పాన్ కార్డును ఆధార్తో లింక్ చేయడం ప్రక్రియ 2022 మార్చ్ 31 వరకు చేయకపోతే పాన్ కార్డు పని చేయకుండా పోతుందట.జనవరి చివరి నాటికి ప్రభుత్వ లెక్కల ప్రకారం 43 ,34 ,75 ,209 పాన్ కార్డులకు ఆధార్ నంబర్లు లింక్ అవ్వడం జరిగింది.ఇంకా పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేయాల్సిన వారి సంఖ్యా లక్షల్లోనే ఉందని తెలుస్తుంది.ఇలా లింక్ చేయాలి అనుకున్నవారు ఇ ఫైలింగ్ పోర్టల్ కి వెళ్లి https ://incometaxindiaefiling .gov .in లో క్విక్ లింక్స్ అనే దానిలో లింక్ ఆధార్ అని ఉంటుంది.దానిపై క్లిక్ చేసిన తర్వాత పాన్ నెంబర్ మరియు ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయాలి.రూల్స్ ను అంగీకరిస్తున్నట్లు బాక్స్ లో టిక్ చేయాలి.ఆ తర్వాత కింద ఉండే లింక్ ఆధార్ ను క్లిక్ చేయాలి.పాన్ కార్డుకు లింక్ అయి ఉన్న నెంబర్ కు ఓటీపీ వస్తుంది.దాన్ని ఎంటర్ చేసి వాలిడేట్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ అయినట్లే.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *