Sheela Kaur: సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు హీరోయిన్లు తమ అందాన్ని,ఫిట్ నెస్ ను మైంటైన్ చేస్తూ ఉంటారు.ఆ తర్వాత అవకాశాలు తగ్గడం వలనో లేక వివాహం చేసుకోవడం వలనో సినిమా ఇండస్ట్రీ కి దూరంగా ఉంటారు.అలా సినిమా ఇండస్ట్రీకి దూరమైనా హీరోయిన్ లలో షీలా కూడా ఒకరు.సీతాకోకచిలుక సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు షీలా.ఆ తర్వాత మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన రాజుభాయ్ చిత్రంలో నటించారు.అయితే షీలా కు గుర్తింపు మాత్రం అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పరుగు చిత్రంతో వచ్చిందని చెప్పచ్చు.
పరుగు సినిమా తర్వాత షీలా మస్కా,అదుర్స్ వంటి పలు చిత్రాలలో కూడా నటించింది.తెలుగుతో పాటు షీలా తమిళంలో కూడా పలు చిత్రాలలో నటించడం జరిగింది.సినిమా అవకాశాలు తగ్గడంతో షీలా ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నారు.ఆ తర్వాత ఆమెకు కాన్సర్ వ్యాధి సోకిందని సమాచారం.అయితే కాన్సర్ ఉన్న కూడా షీలా కొన్ని సినిమాలలో నటించిందట.తనకు కాన్సర్ ఉన్నట్టు షీలా ఎప్పుడు కూడా బయటపడలేదు.షీలా కాన్సర్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది.ప్రస్తుతం ఆమె కాన్సర్ తో పోరాడుతుందని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.
అయితే ఈ విషయం ఎవరికి చెప్పకుండా ఎవరి సహాయం తీసుకోకుండా ఆమె మేనేజ్ చేసుకుంటుందని సమాచారం.ప్రస్తుతం షీలా సూపర్ మార్కెట్ స్టోర్ నడుపుతుందని సమాచారం.ఎవరి సహాయం తీసుకోవడం ఇష్టం లేకనే ఒక్కప్పుడు హీరోయిన్ గా ఉన్న షీలా ఇప్పుడు సూపర్ మార్కెట్ పెట్టుకొని జీవితం గడుపుతుందట.ప్రస్తుతం షీలా పరిస్థితి తెలిసిన వాళ్ళు షాక్ అవుతున్నారు.ఆమె తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కూడా ఎవరితో షేర్ చేసుకోకుండా జాగ్రత్తపడటం విశేషం.