తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన చాల మంది అమ్మాయిలు యెంత తక్కువ సమయంలో గుర్తింపు తెచుకుంటారో అంతే తక్కువ సమయంలో కనుమరుగైపోతారు.అలా తక్కువ సమయంలో మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాలకు దూరమైనా హీరోయిన్లలో పార్వతి మెల్టెన్ కూడా ఒకరు.ప్రముఖ దర్శకుడు దేవా కట్ట దర్శకత్వం వహించిన వెన్నెల చిత్రంతో 2005 లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిని పార్వతి మెల్టెన్.ఈ సినిమాలో హీరో రాజా కు జోడిగా నటించి తన అందంతో,నటనతో మంచి గుర్తింపును సంపాదించుకుంది.
అయితే ఈ సినిమాతో అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేకపోయిన పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన జల్సా సినిమాలో జెన్నిఫర్ లోఫెజ్ అనే పాటతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది ఈ అమ్మడు.ఆ తర్వాత మహేష్ బాబు దూకుడు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి అందరి దృష్టిని ఆకట్టుకుంది.అప్పట్లో ఈ పాట సోషల్ మీడియా ను బాగా షేక్ చేసింది అని చెప్పచ్చు.

అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈమె సినిమాలకు దూరంగా ఉంటుంది.వెన్నెల సినిమా తర్వాత తెలుగులో గేమ్,అల్లరే అల్లరి అనే సినిమాలలో నటించిన కూడా అంతగా క్లిక్ అవ్వలేకపోయింది.అయితే కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన ఆమె బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంతగా సక్సెస్ సాధించలేకపోయింది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

మలయాళంలో కూడా మోహన్ లాల్ హీరోగా నటించిన హాల్లో సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఆ తర్వాత ఈమె తెలుగులో చివరగా 2012 లో రిలీజ్ అయినా యమహో యమా సినిమాలో కనిపించింది.ఆ తర్వాత పార్వతి మెల్టెన్ సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది అని చెప్పచ్చు.2013 లో సంశులాలని వివాహం చేసుకున్న ఈమె ప్రస్తుతం వైవాహిక జీవితంలో బిజీ గా ఉంది.అయితే ఈమెకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
