Pawan Kalyan: ఇటీవలే వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగిన సంగతి అందరికి తెలిసిందే.ప్రస్తుతం ఈ వీరిద్దరి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన కనిపిస్తున్నాయి.మెగా హీరోలందరూ ఈ వేడుకలో ఒకే చోట కనిపించటంతో ఫ్యాన్స్ కు కన్నుల పండుగగా ఉందని చెప్పచ్చు.ముఖ్యంగా ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ స్టైల్ మరియు హెయిర్ స్టైల్ టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచిందని చెప్పచ్చు.
వీరిద్దరి ఎంగేజ్మెంట్ రోజు ఓజి మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్న పవన్ కళ్యాణ్ అందరు వస్తారో రారో అని అనుకున్న సమయంలో చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చారు.వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి ను పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేసి వెళ్లారు.పవన్ కళ్యాణ్ వచ్చే లోపే వీరిద్దరూ రింగులు కూడా మార్చుకున్నారు.అయితే పవన్ కళ్యాణ్ ఏం ధరించిన కూడా అభిమానులు కూడా వాటిని కొనడానికి ఆసక్తి చూపిస్తారు అనే సంగతి అందరికి తెలిసిందే.
నిశ్చిదార్ధం వేడుకలో పవన్ కళ్యాణ్ ధరించి దుస్తులు మరియు బెల్ట్ గురించి కూడా అభిమానులు చర్చించుకుంటున్నారు.బెల్ట్ చాల కొత్తగా ఓజి సినిమా కోసం ప్రత్యేకంగా డిసైన్ చేసినట్లు అందరికి అనిపించింది.ఈ బెల్ట్ ధర లక్ష 20 వేలు ఉంటుందని సమాచారం.ఇది ఒక మిడిల్ క్లాస్ ఉద్యోగి నెల జీతం తో సమానం అని తెలిసిందే.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజి సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు.హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.