షూటింగ్ గ్యాప్ లో ఖరీదైన బైక్ రైడ్ చేసిన పవన్…బైక్ ధర తెలిసి షాక్ అవుతున్న నెటిజన్లు…

NEWS DESK
1 Min Read

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలతో,రాజకీయాలతో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే.ఇక సినిమాలలో పవన్ కళ్యాణ్ నటనకు మాత్రమే పరిమితం కాకుండా స్క్రిప్ట్ రైటింగ్,స్టంట్ కొరియోగ్రఫీ,సాంగ్స్ కొరియోగ్రఫీ,దర్శకత్వం మరియు సింగర్ గా కూడా తన టాలెంట్ ను నిరూపించుకొని ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.కొన్ని సినిమాలకు స్క్రీన్ ప్లే మరియు కథను అందించిన పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ సినిమాకు కూడా అందిస్తున్నారని వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం ఈయన హరిహర విరామాలు అనే సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది.ఈ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ షూటింగ్ గ్యాప్ లో లొకేషన్ లో ఖరీదైన బైక్ మీద రైడ్ చేయగా ఈ బైక్ ధర గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

పవన్ హరిహర విరామాలు గెటప్ లో బైక్ మీద రైడ్ చేసి అక్కడున్న అభిమానులను ఆకట్టుకున్నారు.ఈ బైక్ ప్రముఖ సంస్థ అయినా BMW కు చెందింది.ఈ బైక్ BMW RS 1250 GS మోడల్ కు చెందింది.ఇక ఈ బైక్ ధర రూ.24 లక్షలు.ప్రస్తుతం సోషల్ మీడియాలో బైక్ పై పవన్ రైడ్ చేసిన వీడియొ వైరల్ గా మారింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *