ప్రముఖ ఓటిటీ అయినా ఆహ లో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ దక్కుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మొదటి సీజన్ సక్సెస్ అవ్వడంతో రెండవ సీజన్ కూడా ప్రారంభించారు షో నిర్వాహకులు.మొదటి సీజన్ కంటే కూడా రెండవ సీజన్ మరింత ఆసక్తికరంగా మారిందని చెప్పచు.దీనికి కారణం ఈ సీజన్ లో సినిమా సెలెబ్రెటీలతో పాటు రాజకీయనాయకులు కూడా హాజరుకావడమే.
తాజాగా ఈ షో లో పవన్ కళ్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ఎపిసోడ్ పై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ షో లో బాలయ్య పవన్ కళ్యాణ్ ను ఎలాంటి ప్రశ్నలు అడిగారు పవన్ ఎలాంటి సమాధానం ఇచ్చారు అనేదానిపై ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది.పవన్ కళ్యాణ్ బ్లాక్ హుడి ధరించి హాజరైన ఈ షో ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పవన్ ధరించి వచ్చిన బ్లాక్ హుడి ధర యెంత ఉంటుంది అనే దాని గురించి ప్రస్తుతం నెటిజన్లు ఆరా తీస్తున్నారు.ఈ షో కు పవన్ కళ్యాణ్ ధరించి వచ్చిన హుడి హ్యూగో బాస్ కంపెనీ కి చెందింది.విదేశాలలో దీని ధర 245 డాలర్లు ఇండియా లో అయితే 20 వేళా నుంచి 27 వేల వరకు ఉంటుందని సమాచారం.