RRR లోని దోస్తీ పాటకు అద్భుతంగా పియానో ప్లే చేసిన పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా…వీడియొ వైరల్…

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించిన చిత్రం ట్రిపుల్ ఆర్ థియేటర్లలో రిలీజ్ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపించింది.ప్రస్తుతం ప్రముఖ ఓటిటి లో కూడా ప్రసారం అవుతున్న ఈ చిత్రం రిలీజ్ అయినా అన్ని భాషలలో సూపర్ హిట్ గా నిలిచి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరి ప్రశంసలు అందుకుంది.ఈ చిత్రంలో హీరోలు రామ్ చరణ్,ఎన్టీఆర్ తమ నట విశ్వరూపాన్ని చూపించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

తాజాగా ప్రముఖ ఓటిటి లో రిలీజ్ అయినా ఈ చిత్రం అక్కడ కూడా అదరగొడుతుంది.ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాలోని పాటకు పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ అదిరిపోయే పెర్ఫార్మన్స్ ఇచ్చిన వీడియొ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరిని ఆకట్టుకుంటుంది.సోమవారం అకిరా నందన్ తన స్కూల్ గ్రాడ్యువేషన్ ను పూర్తి చేసుకున్నారు.ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్,రేణు దేశాయ్ కూడా పాల్గొన్నారు.ఈ ఈవెంట్ లో అకిరా ట్రిపుల్ ఆర్ సినిమాలోని దోస్తీ పాటకు పియానో పై పెర్ఫార్మన్స్ చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.

ఈ వీడియొ చూసిన పవన్ అభిమానులు తండ్రికి తగ్గ తనయుడు అంటూ అకిరా పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.తాజాగా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్ ను కూడా అకిరా పియానోపై వాయించారు.ఈ పాట వీడియొ ను తన ఇంస్టా గ్రామ్ అకౌంట్ లో షేర్ చేయడంతో అది వైరల్ అయ్యింది.అకీర లోని ఈ టాలెంట్ ను చూసి త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడు అని పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *