Pawan Kalyan: తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ అయినా సింహాద్రి సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.ప్రస్తుతం ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయినా తొలిప్రేమ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి అందరికి తెలిసిందే.హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా మరోసారి 4 కె వెర్షన్ లో సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.
ఇప్పటికే రిలీజ్ అయినా పవన్ కళ్యాణ్,మహేష్ బాబు,రామ్ చరణ్,ప్రభాస్,ఎన్టీఆర్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి భారీగా రెస్పాన్స్ వచ్చింది.తాజగా ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ అయినా సింహాద్రి సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించి బిగ్గెస్ట్ హిట్ అయినా తొలిప్రేమ సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ సినిమా రిలీజ్ అయ్యి 25 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఈ సినిమాను జూన్ 30 న విడుదల చేయడానికి అధికారికంగా ప్రకటించటం కూడా జరిగింది.ప్రస్తుతం ఈ సినిమా 4 కె ప్రింట్ వర్క్ జరుగుతుంది.కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించింది.1998 లో రిలీజ్ అయినా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.