ఫస్ట్ మూవీతోనే బాగా క్రేజ్ తెచ్చుకున్న ఈ చిన్ననాటి ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో తెలుసా…

సామజిక మాధ్యమాల్లో ఈ మధ్యకాలంలో సెలెబ్రెటీల చిన్ననాటి ఫోటోలు బాగా దర్శనం ఇస్తున్నాయి.తమకు ఇష్టమైన స్టార్ హీరో,హీరోయిన్ ఫోటోలను చూసేందుకు అభిమానులు కూడా బాగా ఆసక్తిని చూపిస్తున్నారు.ఈ క్రమంలోనే ఇప్పటికే చాల మంది హీరోయిన్ ల చిన్ననాటి ఫోటోలు,వీడియోలు ప్రతి రోజు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.ఇటీవలే తాజాగా అమాయకపు చూపులతో క్యూటీగా ఉన్న ఒక హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న క్రేజీ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు.ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో బిజీ గా ఉంది ఈ అమ్మడు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ళ మతి పోగొట్టి క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.ఈమె సోషల్ మీడియాలో చాల యాక్టీవ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను,తన సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ను అభిమానులతో షేర్ చేసుకుంటుంది.

ఈ చిన్ననాటి ఫొటోలో ఉన్న చిన్నారి మరెవరో కాదు పాయల్ రాజ్ పుత్.మొదటి సినిమా తోనే నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకొని అందరి ప్రశంసలు పొందింది.షూటింగ్ సెట్ లో కూడా ఆక్టివ్ గా ఉంటూ సందడి చేస్తుంది పాయల్.ఇటీవలే ఆమె షూటింగ్ సెట్ లో ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.అజయ్ భూపతి తెరకెక్కించిన ఆర్ ఎక్స్ 100 చిత్రంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్.కార్తికేయ హీరోగా చేసిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *