Home సినిమా పెళ్ళిలో భార్య,మరదలితో కలిసి స్టెప్పులేసిన రామ్ చరణ్ వీడియొ వైరల్…

పెళ్ళిలో భార్య,మరదలితో కలిసి స్టెప్పులేసిన రామ్ చరణ్ వీడియొ వైరల్…

0

మెగా కోడలు ఉపాసన కొణిదెల సోదరి అయినా అనుష్పాల కామినేని వివాహం అర్మాన్ ఇబ్రహీం తో బుధవారం చాల గ్రాండ్ గా జరిగింది.గత కొంత కాలంగా అనుష్పాల కామినేని అర్మాన్ ఇబ్రహీం ను ప్రేమించి పెద్దలను ఒప్పించి అందరి సమక్షంలో ఇటీవలే అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.ఈ పెళ్లి వేడుకకు కామినేని ఫ్యామిలీ తో పాటు మెగా ఫ్యామిలీ కూడా హాజరయ్యి సందడి చేసారు.

ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి సంగీత్,మెహందీ ఇలా అన్ని పెళ్లి వేడుకలలోను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు.రామ్ చరణ్ ఉపాసన ఈ పెళ్లి వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నారు.ఎంతో సరదాగా సాగుతున్న ఈ పెళ్లి వేడుకల్లో రామ్ చరణ్ కూడా భార్య మరియు మరదలితో కలిసి స్టెప్పులు వేశారు.మ్యూజిక్ డైరెక్టర్లు అయినా సాఛేత్ తాండాన్,పరంపర ఠాకూర్ లు పాట పాడుతుంటే రామ్ చరణ్ మరదలు అనుష్పాల తో కలిసి డాన్స్ చేసారు.

మధ్యలో ఉపాసన కూడా స్టెప్పులు వేశారు.ఈ పెళ్లి వేడుకలో హీరో రామ్ చరణ్ స్టెప్పులు వేసిన వీడియొ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.సరదాగా పెళ్ళిలో సందడి చేస్తున్న రామ్ చరణ్ ను చూసి మెగా ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు కూడా చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here