పోకిరి బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోగా ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ ఎవరో తెలుసా…

సినిమా ఇండస్ట్రీలో సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎక్కువగా విలన్ పాత్రలు చేసే సోనూసూద్ నిజజీవితంలో మాత్రం రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.కరోనా సమయంలో చాల మందికి సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు.ఎవరికి ఏ సహాయం కావాలన్నా సోనూసూద్ ను ఆశ్రయించారు చాల మంది.తమిళ సినిమా అయినా కల్లజాగర్ అనే సినిమాతో 1999 లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు సోనూసూద్.మొదటి సినిమాతోనే విలన్ గా ఎంట్రీ ఇచ్చారు.

జయసుధ,నాగబాబు నటించిన హాండ్స్ అప్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.2005 లో అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన సూపర్ సినిమా తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన అతడు సినిమా లో ఆయన పాత్రకు మంచి క్రేజ్ వచ్చింది.అరుంధతి సినిమాలో పశుపతి క్యారక్టర్ ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది.సోనూసూద్ హాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించారు.

ఇక సోనూసూద్ తన సొంత బ్యానర్ అయినా శక్తి సాగర్ ప్రొడక్షన్స్ లో పలు సినిమాలు కూడా నిర్మించారు.ప్రస్తుతం ఆయన బ్యానర్ లో బాడ్మింటన్ స్టార్ పి వి సింధు జీవితం బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు.ఇక మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన పోకిరి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పూరి జగన్నాధ్ తెరకెక్కించిన పోకిరి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.అయితే మొదట పూరి జగన్నాధ్ పోకిరి సినిమాను సోనూసూద్ హీరో గా పెట్టి చేయాలనుకున్నారట.కానీ కొన్ని కారణాల వలన సోనూసూద్ తో చేయలేకపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *