ఆ సినిమా దెబ్బకు రెంట్ కట్టలేక ముంబై ఫ్లాట్ ఖాళీ చేస్తున్న పూరీజగన్నాధ్…

సినిమా ఇండస్ట్రీలో సినిమాల ప్రభావం ప్రేక్షకులతో పాటు ఆ సినిమా తీసిన దర్శకులు,నిర్మాతల మీద కూడా పడుతుంది.సినిమా హిట్ అయ్యిందంటే ఓకే కానీ సినిమా ప్లాప్ అయితే మాత్రం ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.ప్రస్తుతం దర్శకుడు పూరీజగన్నాధ్ కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది అనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో రిలీస్ అయినా లైగర్ సినిమా ఘోర పరాజయం పొందిన విషయం అందరికి తెలిసిందే.దాంతో నష్టాలను చవిచూసిన బయ్యర్లు,డిస్ట్రిబ్యూటర్లు తమ డబ్బు తిరిగి ఇచ్చేయాలని పూరి జగన్నాధ్ మీద ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దాని ప్రభావంతో పూరి ముంబైలోని ఫ్లాట్ ఖాళీ చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా పనుల కోసం దర్శకుడు పూరి ముంబైలోని సి ఫేసింగ్ లో 4 బీహెచ్ కె ఫ్లాట్ ను నెలకు పది లక్షలకు అద్దెకు తీసుకున్నారు.అయితే ఇతర ఖర్చులు అన్ని కలిపి నెలకు పదిహేను లక్షలు చెల్లిస్తున్నారని సమాచారం.అయితే లైగర్ సినిమా సూపర్ హిట్ అయ్యి ఉంటె పూరి రేంజ్ మారిపోయేది.కానీ ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో భారీగా నష్టం వచ్చింది.

ఇక ఇటువంటి పరిస్థితుల్లో ముంబై ఫ్లాట్ కు పదిహేను లక్షలు పెట్టడం అవసరమా అని ఫ్లాట్ ఖాళీ చేస్తున్నట్లు సమాచారం.అయితే సినిమా హిట్ అయ్యి ఉంటె బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసేవారేమో కాని సినిమా ప్లాప్ అవ్వడంతో హైదరాబాద్ కు వచ్చేస్తున్నారు అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఆయన అభిమానులు మాత్రం భిన్న అభిప్రాయాలను తెలుపుతున్నారు.అయితే గతంలో పూరి ఇంతకంటే ఎక్కువ ఘోర పరాజయాన్ని పొందారని..అలంటి పరిస్థితినే నిలపడి తట్టుకున్న పూరికి ఇదొక లెక్కన..మళ్ళీ ఏదో ఒక రోజు లేస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *