దుబాయ్ గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న నటి పూర్ణ…పెళ్లి ఫోటోలు వైరల్…

టాలీవుడ్ నటి పూర్ణ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.సీమ టపాకి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పూర్ణ తన అందంతో,నటనతో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.ఆ తర్వాత అవును సినిమా సిరీస్ లో నటించి నటిగా ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.ప్రస్తుతం ఈమె పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తుంది.సినిమాలతో పాటు బుల్లితెర మీద కూడా పలు టీవీ షోలలో జడ్జి గా వ్యవహరిస్తూ బిజీగా గడుపుతుంది.ఇక కొన్ని రోజుల క్రితం నటి పూర్ణ కు నిశ్చితార్ధం జరిగిన సంగతి అందరికి తెలిసిందే.దుబాయ్ లో బిజినెస్ మ్యాన్ అయినా ఆసిఫ్ అలీ తో పూర్ణ నిశ్చితార్ధం జరిగింది.

ఇక తాజాగా దుబాయ్ లో పూర్ణ వివాహం చాల అంగరంగ వైభవంగా జరిగింది.బంధువులు,కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.ఇక పెళ్లి తర్వాత రిసెప్షన్ కూడా అక్కడే జరిగింది.నటి పూర్ణ తన పెళ్లి ఫోటోలను షమ్నా ఖాసీం అనే ఇంస్టాగ్రామ్ అకౌంట్ తో అభిమానులతో షేర్ చేసుకుంది.ఈ ఫోటోలను షేర్ చేస్తూ తన భర్త గురించి చాల గొప్పగా రాసుకొచ్చింది పూర్ణ.నేను ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళను కాకపోవచ్చు..మంచి జీవిత భాగస్వామికి ఉండాల్సిన లక్షణాలు నాలో లేకపోవచ్చు…కానీ మీరు నన్ను మీకంటే నేను తక్కువ అనుకునేలా ప్రవర్తించలేదు నొప్పించలేదు.

Poorna Marriage Photos
Poorna Marriage Photos

నేను ఎలా ఉన్నానో అలాగే మీరు నన్ను ఆరాధించారు.మీరు నన్ను మార్చడానికి ఏనాడూ ప్రయత్నించలేదు.మారమని నాకు చెప్పను లేదు.నాలోని ఉత్తమ ప్రతిభను బయటకు తీసుకురావడానికి నన్ను మీరు ఎంతగానో ప్రోత్సహించారు.ఈరోజు మీరు నేను మనకెంతో సన్నిహితమైన వారి మధ్య ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించాం.ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనా సరే నేను మీకు అండగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను అంటూ పూర్ణ రాసుకొచ్చారు.ప్రస్తుతం ఈమె పెళ్లి ఫోటోలు మరియు ఈమె రాసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.ఇక అభిమానులు నటి పూర్ణ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *