లక్ష్మీకళ్యాణం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయినా హీరోయిన్ కాజల్.మొదటి సినిమాతోనే తన అందంతో,అభినయం తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఆ తర్వాత చందమామ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని వరుసగా సినిమా అవకాశాలతో బిజీగా అయిపొయింది కాజల్.రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ కు జోడి గా నటించి మగధీర చిత్రంతో మరొక హిట్ తన ఖాతాలో వేసుకుంది.మగధీర చిత్రంతో ఊపందుకున్న కాజల్ ఆ తర్వాత వరస సినిమా అవకాశాలను దక్కించుకుంది.దాదాపు తెలుగులో అందరు స్టార్ హీరోలకు జోడిగా నటించింది కాజల్ అగర్వాల్.తెలుగుతో పాటు తమిళ్ లోను చాల సినిమాలలో నటించింది కాజల్.
ఆ తర్వాత కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే వివాహం చేసుకుంది ఈ అందాల చందమామ.ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్ ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది.అయితే తమ బిడ్డ పేరు నీల్ కిచ్లు అని కాజల్ భర్త గౌతమ్ కిచ్లు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఇటీవలే కాజల్ మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆచార్య లో నటించిన సంగతి అందరికి తెలిసిందే.కానీ ఈ చిత్రంలో కాజల్ నటించిన సన్నివేశాలను కొన్ని కారణాల వలన తొలగించినట్టు ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ ప్రకటించటం జరిగింది.
తల్లి అయినా తర్వాత కాజల్ పూర్తిగా మారిపోవడంతో సోషల్ మీడియాలో కొందరు ఆమెపై ట్రోల్స్ కూడా చేసారు. అయితే ఆ ట్రోల్స్ కు కాజల్ గట్టిగానే కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది.ఒక బిడ్డకు తల్లి అయినా తర్వాత కాజల్ తన మొత్తం సమయాన్ని ఆ బిడ్డకే కేటాయించాలి అని అనుకుంటుందట.దాంతో కాజల్ పూర్తిగా సినిమాలకు గుడ్ బాయ్ చెప్పనుంది అని ఒక సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.ఆ వార్త నిజమో కాదో తెలియాలంటే కాజల్ స్పందించాల్సిందే.