ప్లాప్ సినిమా కోసం 2 బిగ్గెస్ట్ హిట్ సినిమాలను వదులుకున్న ప్రభాస్…ఆ సినిమాలు యేవో తెలిస్తే షాక్ అవుతారు…

చిత్ర సీమలో సాధ్యం, అసాధ్యం అంటూ ఏదీ ఉండదు. ఒక్కో సారి హిట్ అవుతుందని అనుకున్న కథతో మూవీ చేస్తే ఫెయిల్ అవ్వచ్చు.. ఆడియన్స్ కు రీచ్ అవుతుందా అన్న అనుమానంతో చేస్తే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయచ్చు. ఇలా ఏదైనా జరగచ్చు. అలా చాలా మంది సూపర్ హీరోలు ఎన్నో మంచి బ్లాక్ బస్టర్ హిట్ కథలను వదులుకున్నారు. 

రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’తో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నారు ప్రభాస్. బాహుబలి సీక్వెల్ ఇండియానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి ప్రేక్షకాధరణ పొందింది. భారీ అంచనాలతో తరువాత వస్తున్న చిత్రం ‘ఆది పురుష్’ ట్రైలర్ నవంబర్ లో రిలీజవగా, ఒక్క ట్రైటరే పీక్ లెవల్లో జనాల్లోకి వెళ్లింది. భారీ బడ్జెట్ తో తెరెకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు కూడా అదే మేరకు ఉన్నాయి. దీనికి తోడు ‘సలార్, ప్రాజెక్ట్ కే’ ప్రభాస్ చేతిలో ఉన్నాయి.

భిన్నమైన కథలను ఎంచుకోవడంలో ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడని చెప్పుకోవాలి. మాస్, క్లాస్, ఫ్యామిలీ, రొమాంటిక్, యాక్షన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఆహార్యానికి అన్ని క్యారెక్టర్లు ఇట్టే ఇమిడిపోతాయి. ఒక నటుడికి హిట్లే ముఖ్యం కాదు. అప్పుడప్పుడు ఫ్లాప్ లు కూడా వచ్చిపడుతుంటాయి. అందులో నుంచి నేర్చుకున్నవి జీవితంలో సక్సెస్ సాధించేందుకు ఎంతో ఉపయోగపడతాయి. డైరెక్టర్ పైడిపల్లి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేసిన చిత్రం ‘మున్నా’ తల్లి మరణానికి కారణమైన తండ్రిపై పగ తీర్చుకునే బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత ఆడలేదు. 

‘మున్నా’ ప్రాజెక్టు సమయంలోనే ఆయనకు మరో రెండు ప్రాజెక్టుల్లో నటించే అవకాశాలు వచ్చాయి. కానీ మున్నా కథను ఎంచుకున్న రెబల్ స్టార్ ఆ రెండింటికీ నో చెప్పాడు. అవేంటో చూద్దాం.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రభాస్ తో సినిమా తీయాలని అనుకున్నాడు. మంచి కథ కోసం అన్వేషిస్తున్న సమయంలో సుకుమార్ ‘ఆర్య’ కథను వినిపించాడు. కానీ ప్రభాస్ తనకు లవ్ అంతగా సెట్ అవ్వదని భావించి నో చెప్పాడు. దీంతో ఆ అవకాశం అల్లు వారింటి తలుపుతట్టింది. అల్లు అర్జున్ అప్పటికి గంగోత్రి చేసినా అంతగా కలిసి రాలేదు. తర్వాత చేసిన ఆర్య టాలీవుడ్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. 

Arya
Arya

ఇక రెండో ప్రాజెక్టు విషయనికస్తే. రవితేజ నటించిన భద్ర. భద్ర సినిమా తీయాలని అనుకున్నప్పుడు బోయపాటి శ్రీను మొదట ప్రభాస్ కు కథ వినిపించాడు. కానీ బోయపాటికి అదే మొదటి సినిమా కావడంతో భయంతో ప్రభాస్ వెనక్కు తగ్గాడు. తర్వాత బోయపాటికి రవితేజ ఎస్ చెప్పడంతో భద్ర మనముందుకు వచ్చింది. సమకాలంలోనే వచ్చిన మున్నా కన్నా ఆర్య, భద్ర సూపర్ హిట్టవడంతో ప్రభాస్ కొంత నిరాశకు గురయ్యాడనే ఇండస్ర్టీలో టాక్ వినిపించింది.

Bhadra
Bhadra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *