Home సినిమా Salaar Movie: ఆ మూవీకి సలార్ రీమేకా

Salaar Movie: ఆ మూవీకి సలార్ రీమేకా

0
Salaar Movie
Salaar Movie

Salaar Movie: ప్రశాంత్ నీల్ భారీ బడ్జెట్ తో ఎక్కడ కూడా కాంప్రమైస్ కాకుండా సలార్ మూవీ ని తెరకెక్కిస్తున్నారు.పూర్తి స్థాయి యాక్షన్ చిత్రం గా వస్తున్నా ఈ సలార్ మూవీ లో ప్రభాస్ కు జోడిగా శృతి హాసన్ నటిస్తుంది.ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తం గా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.ప్రపంచ వ్యాప్తం గా సినిమా అభిమానులు మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్నా సలార్.ఆదిపురుష్ ప్లాప్ తర్వాత ప్రభాస్ అభిమానుల ఆశలన్నీ సలార్ సినిమా మీదనే ఉన్నాయి అని చెప్పచ్చు.ఇక ఈ సినిమా మీద ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఉన్నాయి.

ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ హిట్ సినిమాతో మొత్తం ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకున్నారు.ప్రశాంత్ నీల్ మరియు ప్రభాస్ ఈ ఇద్దరి కాంబినేషన్ మూవీ కోసం అటు ప్రభాస్ అభిమానులతో పాటు సినిమా ప్రేక్షకులు అందరు ఎంతో క్యూరియాసిటీ చూపిస్తున్నారు.అందరి అంచనాలకు తగినట్లుగానే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఎక్కడ కూడా కాంప్రమైస్ కాకుండా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ప్రభాస్ కు జోడిగా శృతిహాసన్ ఈ సినిమాలో నటిస్తుంది.ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన కూడా ఈ సినిమా ను డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు సినిమా యూనిట్.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా టీజర్ ఈ సినిమా మీద ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెంచుతుంది.ఇక సలార్ గురించిన మరొక వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన వినిపిస్తుంది.సలార్ మూవీ మరొక సినిమాకు రీమేక్ అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అయితే ఈ వార్త వినిపించడం ఇది మొదటి సారి కాదు.గతంలో కూడా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఉగ్రం సినిమా కు సలార్ రీమేక్ అని కొన్ని వార్తలు వినిపించాయి.అయితే వీటి మీద ఎలాంటి క్లారిటీ కూడా రాలేదు.ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్సుర్ ఈ సినిమా గురించి గతంలో మాట్లాడిన కొన్ని మాటలు తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.గతం రవి బస్సుర్ సలార్ సినిమా ఉగ్రం సినిమాకు రీమేక్ అని అర్ధం వచ్చేలా మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here