Ram Charan Upasana: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రాంచరణ్,ఉపాసన కూడా ఒకరు.వీరిద్దరూ త్వరలోనే తల్లితండ్రులు కాబోతున్న సంగతి అందరికి తెలిసిందే.వీరికి పుట్టబోయే బిడ్డ కోసం అటు మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఒకపక్క రామ్ చరణ్ సినిమాలతో బిజీ గ ఉన్నప్పటికీ తన సతీమణి ఉపాసన కోసం టైం స్పెండ్ చేస్తున్నారు.ఉపాసన కూడా తన పనులలో బిజీ గా గడుపుతున్నారు.
ఈ సంవత్సరం జులై లో ఆమె బిడ్డకు జన్మ ఇస్తున్నారు.ఉపాసన( Upasana Konidela )తనకు పుట్టబోయే బిడ్డ కోసం ఇప్పటికే అన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారు.ఇప్పటికే చాల మంది రామ్ చరణ్,ఉపాసన లకు పుట్టబోయే బిడ్డ కోసం కానుకలు కూడా పంపిస్తున్నారు.ఈ క్రమంలోనే ఉపాసన ఒక కానుకను అందుకున్నారు.ప్రజ్వల ఫౌండేషన్ నుంచి రామ్ చరణ్,ఉపాసన కు పుట్టబోయే బిడ్డ కోసం ఒక అందమైన ఉయ్యాలా కానుకగా వచ్చింది.
ప్రజ్వల ఫౌండేషన్ వారు ఒక అందమైన ఉయ్యాలా ను చేయించి రామ్ చరణ్( Ram Charan ),ఉపాసన కు పుట్టబోయే బిడ్డ కోసం గిఫ్ట్ గా ఇచ్చారు.వీటికి సంబంధించిన ఫోటోలను ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి.ప్రజ్వల ఫౌండేషన్ వారు సెక్స్ ట్రాఫికింగ్ లో ఇరుకొన్ని బయటపడిన మహిళలకు ఆశ్రయంతో పాటు ఉపాధిని కూడా కలిగిస్తున్నారు.ఆ మహిళలు తయారు చేసిన ఉయ్యాలా ఫోటోలను షేర్ చేస్తూ ఉపాసన ఇలా రాసుకొచ్చారు.ఎంతో సంతోషంగా ఉంది.మీరు పంపించిన ఈ అపూర్వకానుక నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.ఈ ఉయ్యాలా ధైర్యం,బలం,ఆత్మగౌరవం,ఆశకు ప్రతీకగా తన బిడ్డకు గుర్తుండిపోతుందని ఈ కానుకను అందుకున్నందుకు చాల గర్వంగా ఉందని ఉపాసన రాసుకొచ్చారు.