Home ట్రెండింగ్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఇలా కూడా చేయచ్చా.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది..

ప్రీ వెడ్డింగ్ షూట్ ఇలా కూడా చేయచ్చా.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది..

0
pre wedding shoot
pre wedding shoot

ఇండియన్ కల్చర్ లో వివాహానికి ఒక గుర్తింపు ఉంటుంది. క్రితం రోజుల్లో వారం రోజుల పాటు వివాహ తంతు కొనసాగేదంటే అతిశయోక్తి కాదు. ఇరువైపులా బంధువులు, వారికి సపర్యలు, అలకలు, వరుడు, వధువుల ప్రత్యేక పూజల్లో వారం కూడా సరిపోయేది కాదు. అందుకే భారతదేశంలో వివాహాన్ని గొప్పదిగా భావించే వారు. పెళ్లంటే రెండు జీవితాలు కలవడం మాత్రమే కాదు.. రెండు కుటుంబాలు ఏకం అవుతాయి. అందుకే దానికి అంత ప్రాధాన్యత ఇస్తాం. 

pre wedding shoot

ప్రస్తుత పెళ్లి తంతులో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అందరూ బిజీగా మారారు. ప్రస్తుతం జరుగుతున్న ఒక్క రోజు పెండ్లికే దగ్గరి బంధువులు సైతం గంటల్లో హాజరవుతున్నారంటే ఎంతటి బిజీ లైఫో చెప్పక్కర్లేదు. ఇక వివాహ తంతుకు ముందు జరిగే ‘ప్రీ వెడ్డింగ్ షూట్’ ప్రస్తుతం వెర్రి తలలు వేస్తుందనడంలో సందేహం లేదు. వధువు, వరుడు పెళ్లికి ముందే వివిధ ఫోజుల్లో ఫొటోలు దిగుతారు. దీన్నే ప్రీ వెడ్డింగ్ షూట్ అంటారు.  తమ బంధం డిఫరెంట్ గా ఉండాలని భావించే కాబోయే వధువు, వరుడు వివిధ ప్రదేశాలకు వెళ్లి షూట్ లో పాల్గొంటున్నారు. దేవాలయాలు, సముద్రాలు, టూరిస్ట్ ప్లేస్ లు ఇంకా ఇందులో అనేకం ఉన్నాయి. 

ఇటీవల ఒక జంట తమ ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. నవ వధూవరులు బైక్ పై కూర్చొని ఉండగా, క్రేజ్ సాయంతో సినిమాల్లో లాగా ఒక స్టంట్ నిర్వహించారు. ఈ షూట్ వీడియోను బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనే యూజర్ లో ట్వీట్ చేశారు. ‘ఇది ప్రీ వెడ్డింగ్ షూట్ నేను దీన్ని పొందుతున్నాను’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. వెరైటీ కోసం ప్రాణాలను పనంగా పెడుతున్నారు. ఈస్టంట్ కు దర్శకుడు ఎవరు..? అంటూ పోస్టులు పెడుతున్నారు. ఏమైనా అనుకోని సంఘటన జరిగితే షూట్ మాట అటుంచితే పెళ్లి అవుతుందా అంటూ మరికొందరు పోస్ట్ చేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here