ప్రేమించి వివాహం చేసుకున్న ఈ స్టార్స్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా…

సినిమా ఇండస్ట్రీలో చాల మంది నటి నటులు తమకు ఇష్టమైన వాళ్ళను ప్రేమించి వివాహం చేసుకున్న వాళ్ళు చాల మందే ఉన్నారు.అందులో కొంత మంది సినిమాకు సంబంధం లేని బయట వాళ్ళను పెళ్లి చేసుకుంటే మరి కొంత మంది సినిమాలలో తమతో కలిసి నటించిన వాళ్ళను ప్రేమించి వివాహం చేసుకున్నారు.ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెళ్లి చేసుకున్న స్టార్స్ మధ్య యెంత ఏజ్ గ్యాప్ ఉందంటే..

సూర్య,జ్యోతిక:వీరిద్దరూ ప్రేమించి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.వీళ్లిద్దరు కలిసి దాదాపుగా ఏడు సినిమాలకు పైగా నటించారు.తమిళ్ లో గౌతమ్ మీనన్ తెరకెక్కించిన కాకా కాకా చిత్రంలో వీళ్లిద్దరి కాంబినేషన్ కి మంచి క్రేజ్ వచ్చింది.సూర్య కంటే జ్యోతిక మూడేళ్లు చిన్నది.తెలుగులో సూర్య గజినీ చిత్రంతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

నాగచైతన్య,సమంత:గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏమ్ మాయ చేసావే చిత్రంలో మొదటి సరిగా వీళ్లిద్దరు కలిసి నటించారు.ఆ తర్వాత కొన్ని సినిమాలు కలిసి నటించిన వీళ్లిద్దరు ప్రేమించి పెద్దలను కూడా ఒప్పించి వివాహం చేసుకున్నారు.కానీ ఇటీవలే కొన్ని కారణాల వలన వీళ్లిద్దరు విడిపోయి విడాకులు తీసుకున్నారు.సమంత కంటే నాగ చైతన్య ఒక సంవత్సరం పెద్ద.

వరుణ్ సందేశ్,వితిక:తెలుగు సినిమా ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ సందేశ్.ఆ తర్వాత కొత్త బంగారు లోకం చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని తన కంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.పడ్డానండి ప్రేమలో మరి చిత్రంలో వితిక తో కలిసి నటించాడు.ఆ తర్వాత వితిక తో ప్రేమ వివాహం చేసుకున్నాడు వరుణ్.ఏజ్ లో వితిక వరుణ్ సందేశ్ కంటే మూడు సంవత్సరాలు చిన్నది.

నాగార్జున,అమల:నాగార్జున,అమల కలిసి చాల సినిమాల్లో నటించారు.శివ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ కి మంచి ఫాలోయింగ్ ఉంది.నాగార్జున మొదట రామానాయుడు కూతురు లక్ష్మి ని వివాహం చేసుకున్నారు.ఆ తర్వాత నాగ చైతన్య పుట్టిన తర్వాత కొన్ని కారణాల వలన వీరిద్దరూ విడిపోయారు.నాగార్జున అమలను పెళ్లి చేసుకున్నారు.నాగార్జున కంటే అమల ఎనిమిది సంవత్సరాలు చిన్నది.

రామ్ చరణ్,ఉపాసన:చిరుత సినిమాతో చిరంజీవి వారసుడిగా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు రామ్ చరణ్.ఆ తర్వాత మగధీర సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.రామ్ చరణ్ ఉపాసనను వివాహం చేసుకున్నారు.ఉపాసన రామ్ చరణ్ కంటే అయిదు సంవత్సరాలు చిన్నది.

ఎన్టీఆర్,ప్రణతి:ఎన్టీఆర్,ప్రణతిల పెళ్లి పెద్దల సమక్షంలో చాల వైభవంగా జరిగింది.వీళ్ళిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహం.ఎన్టీఆర్ సినిమాలలో తన నటనతో డాన్స్ తో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు.ప్రణతి ఎన్టీఆర్ కంటే ఎనిమిది సంవత్సరాలు చిన్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *